షాద్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత కమ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి రాంచంద్రారెడ్డి (55)ని కిడ్నాప్ చేయటమే కాదు.. దారుణంగా హత్య చేసిన వైనం సంచలనంగా మారింది. భూతగదాలే ఆయన హత్యకు కారణంగా చెబుతున్నారు. దాయాదులే ఈ దారుణానికి ఒడికట్టినట్లుగా తెలుస్తోంది. రాంచంద్రారెడ్డి జడ్చర్లలో ఉంటున్నారు. ఆయనకు అక్కడ పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఆయన స్వగ్రామం ఫరూఖ్ నగర్ మండలం అన్నారం.
సొంతూర్లో ఆయనకు వ్యవసాయ భూములు ఉండేవి. వీటికి సంబంధించి దాయాదులతో ఆయనకు విభేదాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన వివాదంపై గతంలోనే ఆయన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా శుక్రవారం మధ్యాహ్నం భూవివాదం గురించి మాట్లాడుకుందామని దాయాదులు చెప్పటంతో డ్రైవర్ తో కలిసి రాంచంద్రారెడ్డి తన ఇన్నోవా వాహనంలో షాద్ నగర్ పట్టణానికి వచ్చారు. కారులోనే మాట్లాడుకుంటున్న సమయంలో వారి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
కత్తులు బయటకు తీసిన దాయాదుల బెదిరింపులతో డ్రైవర్ భయపడి పారిపోయాడు. దీంతో రాంచంద్రారెడ్డిని కిడ్నాప్ చేసి తమతో తీసుకెళ్లారు. భయంతో బయటకు పరుగులు తీసిన డ్రైవర్.. జరిగిన ఉదంతాన్ని పోలీసులకు చెప్పారు. సెల్ ఫోన్ ఆధారంగా వాహనాన్ని ట్రాక్ చేశారు.
షాద్ నగర్ మీదుగా హైదరాబాద్ వైపు వాహనం వెళ్లినట్లుగా గుర్తించారు.కొత్తూరు మండలంలోని పెంజర్లశివారులోని ఒక వెంచర్లో ఆయన వాహనం ఉన్న విషయాన్ని గుర్తించారు. అక్కడికి వెళ్లిన పోలీసులకు కత్తిపోట్లకు గురై.. కొన ఊపిరితో ఉన్న రాంచంద్రారెడ్డిని గుర్తించారు. హుటాహుటిన ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. అయితే.. మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచినట్లుగా వైద్యులు తేల్చారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.