సంచలనంగా మారిన మారుతిరావు ఆత్మహత్య ఉదంతం వెనుక అసలేం జరిగింది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. రెండు రోజులు హైదరాబాద్ లో ఉండేందుకు రూం తీసుకున్న ఆయన.. ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు? అన్నది ఒక ప్రశ్న అయితే.. హైదరాబాద్ కు కారులో వచ్చే సమయంలోనూ తన కుమార్తె ఫోటోల్ని చూసుకుంటూ మారుతిరావు వచ్చినట్లుగా చెబుతున్నారు.
ఆయన ఆత్మహత్య జరిగిన తీరు చూస్తే.. విషం తాగిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఆయన బస చేసిన గదిలో పెద్ద రక్తపు వాంతి చేసుకొని ఉండటం.. ముఖం రంగు మారిపోవటం.. ముఖానికి చేతులు అడ్డు పెట్టుకొని చనిపోయారు. ఎప్పుడూ ధీమాగా ఉండే మారుతిరావు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అన్నది ప్రశ్నగా మారింది.
మారుతిరావు ఆత్మహత్య వెనుక వేధింపులే కారణంగా చెబుతున్నారు. ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ.. ఎస్టీ కోర్టులో ట్రయల్స్ మొదలు కావటం.. ఈ హత్య కేసులో శిక్ష తప్పదన్న అంశంపై తీవ్రమైన మనస్తాపానికి గురైనట్లుగా చెబుతున్నారు. వారం క్రితం తనకున్న ఆస్తుల్ని భార్యపేరుతో వీలునామా చేసినట్లుగా సమాచారం. తమ్ముడు శ్రవణ్ కుమార్ తో ఆస్తి పంపకాలు పూర్తి చేసుకున్నారు. అతగాడు కూడా హత్య కేసులో నిందితుడన్న విషయం తెలిసిందే.
ఈ హత్య కేసులో నిందితులుగా ఉన్న అబ్దుల్ బారీ.. సుభాష్ శర్మల నుంచి మారుతిరావుకు వేధింపులు అధికంగా ఉండేవని.. తమకు శిక్ష ఖాయమన్న నాటి నుంచి వారు పెద్ద ఎత్తున డబ్బును డిమాండ్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ కారణంతోనే మారుతిరావు ఆత్మహత్య చేసుకొని ఉంటాడని అంచనా వేస్తున్నారు.