సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ ను వదిలి వెళ్లేందుకు ఏ మాత్రం ఇష్టపడలేదు. తాను అభివృద్ధి చేసిన హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయిన నేపథ్యంలో.. చట్టప్రకారం తనకున్న హక్కును వినియోగించుకుంటూ హైదరాబాద్ లో ఉంటూ.. ఏపీకి చుట్టపు చూపుగా వెళ్లి వచ్చేశారు.
ఏపీ ప్రజలు తమ సీఎంగా ఎన్నుకున్నా.. ఆయన మాత్రం తనను ఎన్నుకున్న ప్రజలకు దగ్గరగా ఉండకుండా.. హైదరాబాద్ మీదున్న భ్రాంతితో బెజవాడకు వెళ్లని వైనంపై తీవ్ర విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే. అలాంటి చంద్రబాబు ఇప్పుడు విజయవాడను వదిలి పెట్టి.. హైదరాబాద్ వచ్చేందుకు ఏ మాత్రం ఇష్టపడటం లేదు.
దాదాపు రూ.10కోట్లకు పైనే ఖర్చు పెట్టించి.. సెక్రటేరియట్ లో తన ఛాంబర్ ను అత్యాధునికంగా తయారు చేయించుకున్న బాబు.. తాను ఇప్పట్లో హైదరాబాద్ ను విడిచిపెట్టేది లేదన్న సంకేతాల్ని ఇచ్చేవారు. అలాంటి ఆయన ఉన్నట్లుండి బెజవాడకు ఎందుకు వెళ్లారు? అక్కడే ఉండిపోవాలని ఎందుకు డిసైడ్ అయ్యారనటానికి సంబంధించిన పార్టీ సీనియర్ నేతలు ఇద్దరు చెబుతున్న అంశాలు ఆసక్తికరంగా వినిపిస్తున్నాయి.
ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిరోజులు.. తాను జాతీయ రాజకీయాలపై కూడా దృష్టి పెడతానని.. ఢిల్లీలో చక్రం తిప్పేందుకు వారంలో రెండు రోజులు వెళ్లి ఉంటానని చెప్పుకునే వారు. అదే రీతిలో మొదటి నెలలో ఢిల్లీ వెళ్లిన ఆయన.. ఒకట్రెండు సార్లు వెంటవెంటనే వెళ్లిన ఆయన.. ఆ తర్వాత నుంచి ఢిల్లీకి వెళ్లటం పూర్తిగా తగ్గించేశారు. దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైన ఉదంతాన్ని చెప్పుకొస్తారు.
కేంద్రంలోని మోడీ సర్కారుకు మిత్రపక్షంగా ఉన్న ఆయన.. మోడీకి సలహాలు ఇవ్వబోయారని.. ఈ సందర్భంగా ఆయన తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సమయంలో అస్సలు ఢిల్లీకి వచ్చే వాడిని కాదని.. ఢిల్లీలో బీజేపీ సర్కారు అధికారంలో లేకున్నా.. తన అధికారుల సాయంతో ఢిల్లీలోని పంచాయితీల్ని పరిష్కరించే వాడినని.. ఢిల్లీకి ఎప్పుడో కానీ రానని.. ఢిల్లీకి వచ్చి అధికారులతో కోసం గడిపే సమయాన్ని రాష్ట్రానికి కేటాయిస్తే కలిగే ప్రయోజం చాలానే ఉందన్న విషయన్ని బాబుకు చెప్పటం.. నర్మగర్భంగా ఢిల్లీకి రావాల్సిన అవసరం లేన్న విషయాన్ని బాబుకు మోడీ చెప్పారని చెబుతారు.
ఓటుకు నోటు వషయంలోనూ.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పీకల్లోతు ఒత్తిడికి గురైన బాబు.. సలహా కోసం మోడీని అడగటం.. ఆయన ఇచ్చిన సలహా మేరకే బెజవాడకు పరిమితం కావటమే కాదు.. అప్పుడప్పుడు వచ్చే విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలని.. దృష్టి మొత్తం ఏపీ మీదనే పెట్టాలని.. తెలంగాణ మీద ఫోకస్ తగ్గిస్తే మంచిదని చెప్పినట్లుగా చెబుతున్నారు. అధికారం లేక.. ప్రజల్లో భావోద్వేగాలు ఎక్కువగా ఉన్న సమయంలో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏపీలో ఉండటం సబబు అని.. అక్కడి సీమాంధ్ర ప్రజలు కూడా సంతోషపడిపోతారని చెప్పినట్లుగా చెబుతున్నారు.
రికార్డు సమయంలో యాభై అంతస్థుల భవనాన్ని కట్టించే దమ్ము.. సమర్థత చంద్రబాబుకు మాత్రమే ఉందని.. ఇలాంటి సత్తా దేశంలో చాలా తక్కువ ముఖ్యమంత్రులకు మాత్రమే ఉందని.. అందుకే తన శక్తి సామర్థ్యాల మొత్తాన్ని ఏపీ మీద పెడితే బాగుంటుందని చెప్పటంతోనే బాబు తన మైండ్ సెట్ మార్చుకొని విజయవాడకు వెళ్లిపోయారని చెబుతున్నారు. ఏది ఏమైనా బాబు బెజవాడలో ఉండిపోవటం ఏపీ ప్రజలకు సంతోషాన్ని కలిగిస్తుందన్న మాట వినిపిస్తోంది.