జేసీ బ్రదర్స్ కు చంద్రబాబు దగ్గర బలం లేదా?

Update: 2020-06-26 11:30 GMT
జేసీ ప్రభాకర్ ని మరియు వాళ్ల కొడుకుని అరెస్ట్ చేసిన తర్వాత టీడీపీ చిన్న బాస్ లోకేష్ అనంతపురం వెళ్లి వాళ్ల కుటుంబాన్ని పరామర్శించాడు. ఆ సమయంలో అనంతపురంలోనే ఉన్న టీడీపీ నాయకులు, మాజీ మంత్రులు సైతం ఒక్కరూ రాలేదు. జేసీ ఫ్యామిలీకి అండగా నిలవలేదు. అధినేత కుమారుడు వచ్చినా కనీసం మర్యాదకైనా వచ్చి పలకరించలేదు.

ఎందరో టీడీపీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ మంచిదే అని కూడా టీడీపీ అధినేత వద్ద వాదించారంట.. అనంతపురం టీడీపీలో జేసీ బ్రదర్స్ కు ఎవరూ పడరు అని.. అది పార్టీకి నష్టం జరుగుతుందని.. కాబట్టి మీరు జేసీని అంత పెద్దగా వెనకేసుకొని రావద్దు అని చంద్రబాబుకు సూచించారట..

అప్పుడు చంద్రబాబు.. పార్టీలోని రెడ్డి సామాజికవర్గం వాళ్లు కూడా కావాలి అని నచ్చ చెప్పినా కూడా టీడీపీ వాళ్లు వినడం లేదు అని టాక్. జేసీ వాళ్లు చేసే అక్రమ పనుల వల్ల పార్టీకి నష్టం జరుగుతోంది అని టీడీపీ సీనియర్ నేతలు చంద్రబాబు ముందర కుండబద్దలు కొట్టారట.. ఈ మేరకు టీడీపీ వర్గాలు అందుకే జేసీ ఫ్యామిలీని చంద్రబాబు దూరం పెట్టారని అంటున్నారు. చంద్రబాబు పట్టించుకోకపోవడానికి ఇదే కారణం అంటున్నాయి.
Tags:    

Similar News