ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా సాటి తెలుగోడైన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించలేదన్న ఆగ్రహం చాలామంది తెలుగువారిలో కనిపించింది. ఇక.. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారి సంగతి చెప్పనక్కర్లేదు. తెలంగాణ మహా సభలు అని చెప్పుకుంటే అభ్యంతరం లేదని.. కానీ ప్రపంచ తెలుగు మహాసభలుఅని చెప్పి.. 42 దేశాలకు చెందిన వారిని పిలిచినట్లుగా గొప్పలు చెప్పినప్పుడు పక్కనున్న తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎందుకు ఆహ్వానం పంపలేదన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది.
ఇందులో లాజిక్ అందరికి తెలిసిందే అయినా.. ప్రపంచ తెలుగు మహాసభలకు సంబంధించి అసలు వ్యూహం వేరే కావటంతో చంద్రబాబుకు ఆహ్వానం అందలేదని చెప్పాలి. ఇదిలా ఉంటే.. అందరి దృష్టి సభలకు ఆహ్వానం అందని చంద్రబాబు గురించే కానీ.. ఈ సభలకు తెలంగాణ రాష్ట్ర సర్కారులో అత్యంత కీలకమైన మంత్రి హరీశ్ రావు ఎక్కడా కనిపించకపోవటం మర్చిపోకూడదు.
ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం సందర్భం గా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాగా.. ముగింపు సందర్భంగా రాష్ట్రపతి కోవింద్ హాజరయ్యారు.ఈ రెండు కార్యక్రమాల్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుండి మరీ నడిపించిన ఈ రెండు కార్యక్రమాల్లో కీలకమైన హరీశ్ ఎందుకు కనిపించనట్లు? అన్నది ప్రశ్న. అయితే.. మీడియాలో కానీ.. సోషల్ మీడియాలో కానీ ఈ ఊసే కనిపించదు.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తెలంగాణ రాష్ట్ర సర్కారు అత్యంత అట్టహాసంగా.. వైభవంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలకు సంబంధించి ఆరంభం.. ముగింపు వేడుకల్లో మాత్రమే కాదు.. మిగిలిన రోజుల్లోనూ మంత్రి హరీశ్ రావు కనిపించింది ఉండదు. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆరంభ.. ముగింపు వేడుకలు జరిగే రోజుల్లో హరీశ్ అవుటాఫ్ స్టేషన్లో ఉండటం.. రెండు సందర్భాల్లో ఢిల్లీలో కేంద్రమంత్రులతో భేటీ కావటం కనిపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పాల్గొనటానికి రాష్ట్రపతి.. ఉప రాష్ట్ర పతి లాంటోళ్లు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తే.. మంత్రి హరీశ్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చుడేందన్నది ఆసక్తికరమైన అంశంగా చెప్పాలి. ఏమైనా.. బాబుకు అందని ఆహ్వానం గురించి మాట్లాడే ముచ్చట పక్కన పెడితే.. హరీశ్ ఎందుకు కనిపించటం లేదన్న క్వశ్చన్ తెలంగాణ వారు సైతం వేయకపోవటం ఏమిటో..?