ఓ రాజకీయ నాయకుడి మీద దాడి జరిగింది. పైగా అది హత్యాయత్నం కూడా. ఈ అవకాశాన్ని ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా తనకు అనుకూలంగా మార్చుకుంటారు.అంతేనా దాడి జరిగిన పట్టణం... నగరంలో తన కార్యకర్తల చేత హల్ చల్ చేయిస్తారు. ఈ దాడిని పెద్ద పెద్ద పోస్టర్లు వేయించుకుని రాబోయే ఎన్నికల్లో లబ్ది పొందాలనీ చూస్తారు. అయితే వీటికి భిన్నంగా... ఓ పరిణితి చెందిన రాజకీయ నాయకుడిలా ప్రవర్తించారు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకుడైన జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం విమానాశ్రయంలో తనపై జరిగిన దాడిని ఓ ఘటనగానే పరిగణించారు తప్ప రాజకీయ లబ్ది కోసం చూడలేదు. విమానాశ్రయంలో ఆయనపై దాడి జరిగిన సమయంలో భారత - వెస్టీండీస్ క్రికెట్ జట్లు విమానాశ్రయంలోనే ఉన్నాయి. బుధవారం ఈ రెండు జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. మూడో మ్యాచ్ ఆడేందుకు పుణే వెళ్లేందుకు ఇరు జట్ల సభ్యులు విమానాశ్రయానికి చేరుకున్నారు. జగన్ పై హత్యాయత్నం జరిగే సమయంలో ఇరు జట్లు అక్కడ ఉండడం చూసిన జగన్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేందుకు సన్నద్ధమయ్యారు. నిజానికి విశాఖపట్నంలోనే వైద్యం చేయించుకోవచ్చు. కాని జగన్ ఆ పని చేయలేదు.విమానాశ్రయంలో ప్రాథమిక చికిత్స చేయించుకున్న జగన్ నేరుగా హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచే ఆసుపత్రికి వెళ్లారు.
ఒకవేళ ఈ ఘటనను రాజకీయంగా వాడుకోవాలని జగన్ భావిస్తే విశాఖపట్నంలోనే ఆసుపత్రికి వెళ్లే వారని అంటున్నారు. దీని వల్ల విశాఖపట్నంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని - తన అభిమానులు - కార్యకర్తలు ఆగ్రహంతో ఏమైనా చేసే అవకాశం ఉందని భావించిన జగన్ హైదరాబాద్ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. తనను విశాఖ ఆసుప్రతిలో కనుక కార్యకర్తలు - అభిమానులు చూస్తే తట్టుకోలేక ఎలాంటి విధ్వంసానికైనా వెనుకాడరని భావించే జగన్ హైదరాబాద్ వెళ్లిపోయారని అంటున్నారు. ఇది జగన్ లోని రాజకీయ పరిణితిని తెలియజేస్తోందంటున్నారు. మరోవైపు తనను గాయపరిచిన వ్యక్తిని ఆ సమయంలో తన వ్యక్తిగత సిబ్బంది ఏమీ చేయకూడదనే భావంతో అతడ్ని ఏమీ చేయకండి అని ఆదేశించడం కూడా జగన్ లో పరిణితికి ప్రమాణికం అంటున్నారు.