డీఎస్ రాజ్య‌స‌భ వెన‌క అస‌లు క‌థ !

Update: 2016-05-27 05:57 GMT
కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ ప‌ద‌వి ద‌క్కితే చాలు అనుకున్న మాజీ పీసీసీ అధ్య‌క్షుడు - సీనియ‌ర్ నేత డి.శ్రీ‌నివాస్ టీఆర్ ఎస్ పార్టీలో చేరి రాజ్య‌స‌భ స‌భ్యుడి ప‌ద‌వి కొట్టేసి గారెల‌బుట్ట‌లో ప‌డ్డాడ‌ని రాజ‌కీయ వ‌ర్గాలు ఆశ్చర్యం వ్య‌క్తం చేస్తున్నాయి. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో తెలంగాణ‌కు మ‌ద్ద‌తుగా రాజీనామా చేసి ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లిన‌ బీజేపీ నేత యెండెల ల‌క్ష్మీనారాయ‌ణ‌ మీద పోటీకి దిగిన డీఎస్ ను ఓడించ‌డానికి టీఆర్ ఎస్ - ముఖ్యంగా క‌విత తీవ్ర ప్ర‌య‌త్నాలు చేశారు. డీఎస్ ఓడిపోవాల‌ని మొక్కుకుని ఉస్మానియా క్యాంప‌స్ లో ఇషాంత్ రెడ్డి అనే విద్యార్థి ఏకంగా త‌న‌ను తాను అమ్మ‌వారికి బ‌లిచ్చుకున్న విష‌యం తెలంగాణ‌లోని ప్ర‌జ‌ల‌ను క‌ల‌చివేసింది.

ఆ త‌రువాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, కేసీఆర్ ముఖ్య‌మంత్రి కావ‌డం, కాంగ్రెస్ పార్టీలో డీఎస్ ప్రాధాన్య‌త త‌గ్గ‌డం, ఎమ్మెల్సీ స్థానం భ‌ర్తీ విష‌యంలో క‌నీసం ఆయ‌న‌ను సంప్ర‌దించ‌క‌పోవ‌డం వంటి పరిణామాల నేప‌థ్యంలో ఆయ‌న కాంగ్రెస్ కు హ్యాండిచ్చి కారెక్కారు. టీఆర్ ఎస్ లో చేరిన డీఎస్ కు ఏ మాత్రం త‌క్కువ‌కాకుండా రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా కేసీఆర్ గౌర‌వించారు.

డీఎస్ కు ఆ గౌర‌వ‌మే ఎక్కువ అని, కాంగ్రెస్ అధికారంలో ఉన్న‌ప్పుడు తెలంగాణ‌కు రూపాయి ప‌నిచెయ్య‌ని డీఎస్ ఇప్పుడు ఎవ‌రికి స‌ల‌హాలు ఇస్తార‌ని అంతా గొనుక్కున్నారు. కానీ దాని అస‌లు క‌థ ఏంటి అన్న‌ది ఇప్పుడు ఆయ‌న‌కు ఏకంగా రాజ్య‌స‌భ స్థానం ఇస్తే గాని తెలియ‌డం లేదు. నిజామాబాద్ లో డీఎస్ కు మంచి ప‌ట్టుంది. అంతే కాదు ఆయ‌న సామాజిక వ‌ర్గం మున్నూరు కాపుల‌ది అక్క‌డ పై చేయి ఉంటుంది.

నిజామాబాద్ జిల్లా ఎంపీగా గెలిచిన‌ కేసీఆర్ కూతురు క‌ల్వ‌కుంట్ల క‌విత ఈ రెండేళ్ల‌లో ప్ర‌జ‌ల‌కు పూర్తిగా దూరం అయింద‌ని, వారు ఆమెను మ‌రో సారి ఎంపీగా ఆమోదించే ప‌రిస్థితి అస్స‌లు లేద‌ని తెలుస్తోంది. కేసీఆర్ ఆలోచ‌న‌లు, ప‌నితీరుకు పూర్తి భిన్నంగా క‌విత చ‌ర్య‌లు ఉంటున్నాయ‌ని.. అందుకే వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌ను భయ‌ట‌ప‌డేందుకు, ఆ ఎన్నిక‌లకు త‌న‌కు పోటీకి రాకుండా ఉండేందుకు ఇప్పుడు డీఎస్ కు ప‌ద‌వి వ‌చ్చేలా క‌విత చ‌క్రం తిప్పింద‌ని తెలుస్తోంది. పెద్ద ఎత్తున ఉన్న మున్నూరు కాపు సామాజిక వ‌ర్గం అండ ఉంటే త‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుందని, అందుకే అస‌లు ఏ మాత్రం ప‌రిశీల‌న‌లోనే లేని డీఎస్ ను కేసీఆర్ అనూహ్యంగా రాజ్య‌స‌భ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించార‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News