రాష్ట్ర విభజన నేపథ్యంలో కనిపించని ఒక పోటీ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తుందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే పలు అంశాల్లో ఈ పోలిక కనిపిస్తోంది. ఎక్కడి విషయమో ఎందుకు.. రెండు రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మధ్య.. కొన్ని శాఖల విషయంలో వారి మధ్య ఉండే పోటీ విపరీతమైన ఆసక్తి వ్యక్తమయ్యేలా ఉంటుంది. వార్షిక పరీక్షా ఫలితాల విషయానికే వస్తే.. పది.. ఇంటర్.. ఎంసెట్ లాంటి పరీక్షా ఫలితాల్ని ఒకరి కంటే మరొకరు ముందుగా విడుదల చేయాలన్న తపన వారి మాటల్లో వ్యక్తం కావటం కనిపిస్తుంటుంది.
ఒక్కరోజు వాళ్ల కంటే ముందుగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్లుగా లోగుట్టుగా మీడియా ప్రతినిధుల వద్ద అసలు విషయాన్ని చెప్పేస్తుంటారు ఇరురాష్ట్రాల ఉన్నతాధికారులు. ఇలాంటి వైఖరి అధికారుల మధ్యే కాదు.. ప్రభుత్వాల మధ్య కూడా ఉందా? అంటే అవుననే చెప్పాలి. తాను తీసుకునే నిర్ణయాలన్నీ ఏపీ కంటే మెరుగ్గా ఉండేలా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుక్షణం తపిస్తుంటారని.. ఆయన కొత్త నిర్ణయాల్లోఈ విషయం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు.
తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటు విషయాన్నే చూస్తే.. ఏపీలో ప్రస్తుతం 13 జిల్లాలు ఉన్నాయి. తెలంగాణలో పది జిల్లాలు ఉన్నాయి. లెక్కగా చూస్తే ఏపీతో పోలిస్తే.. తెలంగాణలో జిల్లాలు తక్కువగా ఉండటం కనిపిస్తుంది. కానీ.. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జిల్లాల కలను ఆవిష్కరించిన నేపథ్యంలో పాతవి పదికి తోడుగా కొత్తవి మరో 15 వరకూ వచ్చే వీలుంది. ప్రస్తుతం ప్రతిపాదనలో చెబుతున్నట్లుగా 15 జిల్లాల ఏర్పాటు అధికారికంగా పూర్తి అయితే.. తెలంగాణ జిల్లాల సంఖ్య 25 అవుతుంది. ఇది.. ఏపీ కంటే దాదాపు 12 జిల్లాలు అధికమన్నమాట. కేసీఆర్ కొత్త జిల్లాల ఆలోచన చూసినప్పుడు అనిపించే అంశాల్లో ఒకటి.. ఏపీలో కొత్త జిల్లాలు భవిష్యతులో ఏర్పడినా.. ఏపీలో కంటే తెలంగాణలోనే జిల్లాల సంఖ్య ఎక్కువ ఉండాలన్నట్లుగా కేసీఆర్ ఆలోచనగా ఆయన సన్నిహితులు చెబుతుంటారు. మాటల్లో కనిపించని పోటీ ప్రతి విషయంలోనూ కేసీఆర్ చేతల్లో స్పష్టంగా కనిపిస్తుంది.
తాజాగా కొత్త జిల్లాల ప్రకటన.. వాటి ఏర్పాటు.. ప్రతి జిల్లా కేంద్రంలో నిర్మించాలని చెబుతున్న అత్యాధునిక.. విశాలమైన కలెక్టరేట్ల ముచ్చట చూస్తే.. ఏపీ సర్కారు రాజధాని కోసం నిర్మిస్తున్న నిర్మాణలకు ధీటుగా.. తెలంగాణలోనూ కనిపించేలా కేసీఆర్ జాగ్రత్తపడుతున్నట్లుగా కనిపించక మానదు. 2019 ఎన్నికల సమయానికి.. తన కలల ఆవిష్కారం మధ్యదశకు వచ్చినా.. వాటన్నింటినీ పూర్తి చేయటానికి మరో టర్మ్ అవసరమన్న భావన తెలంగాణ ప్రజలకు కలిగేలా చేయటం.. తమకు అధికారాన్ని కట్టబెట్టే విషయంలో మరో ఆలోచన అన్నది లేకుండా చేయటంలో భాగమే ముఖ్యమంత్రి కొత్త కలలుగా చెబుతుంటారు. ఏపీ కంటే మెరుగ్గా ఉండటంతోపాటు.. ప్రతి విషయంలో అధిక్యం ఉండాలని కేసీఆర్ భావించటం తప్పు కాదు కానీ.. ఆ పరుగులో పడి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో పడేలా చేయకూడదన్న విషయన్ని మర్చిపోకూడదు.