కాంగ్రెస్ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరిక వాయిదా పడింది. 28న కొడుమూరు బహిరంగ సభలో ఆయన టీడీపీలో చేరుతారని ప్రకటించి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ ఇప్పుడది వాయిదా పడింది.
కోట్ల చేరికను డిప్యూటీ సీఎం కేఈ వ్యతిరేకించారు.కానీ వారిని ఒప్పించి కోట్లకు ఒక లోక్ సభ, ఒకఅసెంబ్లీ సీటు ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. కేఈ ఫ్యామిలీకి కూడా డోన్, పత్తికొండ సీట్లు ఇస్తున్నట్టు బాబు సయోధ్య కుదిర్చాడు. దాంతోపాటు కర్నూలు జిల్లాకు వివిధ ప్రాజెక్టులు వాటాల లెక్కలు కూడా తేల్చుకొని చేరేందుకు సిద్ధమయ్యారు. ఇక చేరిక లాంఛనమే అనుకుంటున్న వేళ అర్థాంతరంగా వాయిదా పడింది.
అయితే చంద్రబాబు ఆరోజు అందుబాటులో లేకపోవడమే వాయిదాకు కారణమని కోట్ల వర్గాలు తాజాగా చెప్పాయి. 28న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుమారుడు, డోన్ టీడీపీ ఇన్ చార్జి కేఈ ప్రతాప్ కుమారుడు కేఈ నితిన్ వివాహం గోవాలో ఉండడంతో చంద్రబాబు హాజరుకానున్న దృష్ట్యా కోట్ల చేరిక వాయిదా పడ్డట్టు తెలిసింది.
కేఈ, కోట్ల మధ్య సయోధ్య నెలకొన్న నేపథ్యంలో ఇద్దరినీ ఒకే వేదికపై చేర్చడానికే 28న సభను సీఎం చంద్రబాబు వాయిదా వేసినట్టు సమాచారం. దీంతో బహిరంగ సభను మార్చి 2న నిర్వహించాలని కోట్ల వర్గం నిర్ణయించింది.