రోజులు గడుస్తున్న కొద్దీ.. ఒక పరిణామం తర్వాత మరో పరిణామం చోటు చేసుకున్న సమయంలో అసలు మొదలు ఏం జరిగిందన్నది విషయాన్ని మర్చిపోతాం. చివరకు పరిస్థితి ఎలా తయారవుతుందంటే.. అసలు పోయి కొసరు మాత్రమే మిగులుతుంది. తాజాగా ముద్రగడ ఇష్యూలోనూ అలాంటి పరిస్థితే నెలకొంది. ఆరు రోజుల క్రితం ముద్రగడను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కిర్లంపూడిలోని ఆయన స్వగృహం నుంచి బలవంతంగా ఆయన్ను రాజమహేంద్రపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటి తలుపులు బద్ధలు కొట్టారు. ఆయన్ను.. ఆయన కుటుంబ సభ్యుల్ని బలవంతంగా అదుపులోకి తీసుకొని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇప్పుడు ముద్రగడ దీక్ష ఎందుకు మొదలు పెట్టారన్న విషయం కంటే కూడా.. ఆయన ఇంటి తలుపులు బద్ధలు కొట్టాల్సిన అవసరం ఏమిటని? ఇంట్లోని వారిని అమర్యాదకరంగా పోలీసులు వ్యవహరించినట్లుగా విపక్షాలకు చెందిన పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. ఇలాంటి అంశాల్లో అధికార.. విపక్షాలకు చెందిన నేతలు చెప్పిన విషయాల్ని ఊరికే నమ్మేయటం కంటే కూడా.. అసలేం జరుగుతోంది? అసలు నిజం ఏమిటి? అన్న అంశాల మీదనే ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది.
ఇంతకీ.. ఒక ఉద్యమనేత ఇంటి తలుపులు ఎందుకు బద్ధలు కొట్టారు? వారి కుటుంబ సభ్యులను బలవంతంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు? అసలు ముద్రగడ దీక్షను ఎందుకు చేపట్టారు? లాంటి ప్రశ్నలు వేసుకున్నప్పుడు నిజాల్లోకి ప్రయాణం మొదలవుతుంది. ఇప్పడు రకరకాల మాటలతో భావోద్వేగాల్ని హైపిచ్ కు తీసుకెళుతున్న నేతలంతా.. అసలేం జరిగిందన్న మాటను ఎవరూ చెప్పటం లేదు.
ఇక.. ముద్రగడ అసలు దీక్ష ఎందుకు షురూ చేశారన్న ప్రశ్నను వేసుకుంటే.. తుని విధ్వంసం జరిగిన అనంతరం నెలల తరబడి విచారణ తర్వాత.. తుని ఘటనలో బాధ్యులైన ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొందరిని గుర్తించే ప్రయత్నాన్ని ముమ్మరం చేశారు. దీనిపై ముద్రగడ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడో కీలకమైన అంశం ఉంది. ఈ దేశంలో ఎవరూ చట్టానికి అతీతులు కారు. అది కాపులైనా.. కమ్మలైనా.. రెడ్లు అయినా ముస్లింలు అయినా? ఒక విధ్వంసం వెనుక కొందరు ఉంటే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే కానీ.. వారిపై చట్టబద్ధమైన చర్యలకు అడ్డు పడకూడదు.
ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. ఏపీ సర్కారు అదుపులోకి తీసుకుంటున్న వారికి తుని విధ్వంసానికి అస్సలు సంబంధం లేకున్నా.. వారంతా నిర్దోషులైతే.. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ.. అక్కడ జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా గళం విప్పాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో విధ్వంసంతో సంబంధం ఉంటే మాత్రం వారంతా చట్ట ప్రకారం తీసుకునే చర్యలకు సిద్ధం కావాల్సిందే. ఇలాంటి సమయంలో కొందరు చేసే వాదన ఏమిటంటే.. భావోద్వేగంతో జరిగిన ఘటనలకు చట్టాలు.. సెక్షన్లు అంటూ మానసిక హింసకు గురి చేస్తారా? అని ప్రశ్నిస్తారు.
ఒకవేళ..ఆ వాదనే నిజమని భావిస్తే.. దశాబ్దాల తరబడి సాగిన తెలంగాణ ఉద్యమంలో విధ్వంసం జరిగిందా? అంటే ఒకట్రెండు ఘటనలు మాత్రమేనని చెప్పాలి. కానీ.. అలాంటి ఘటనలపై నాటి ఉమ్మడి రాష్ట్ర సర్కారు కేసులు బుక్ చేస్తే.. దానికి వ్యతిరేకంగా ఎవరూ గళం విప్పలేదు. అంతదాకా ఎందుకు తెలంగాణ ఉద్యమం సందర్భంగా కేసులు ఇంకా కొనసాగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అవి సాగుతూనే ఉన్నాయి. మంత్రులుగా ఉన్న నేతలు కూడా కోర్టు కేసులకు హాజరవుతున్నారు. ఎందుకంటే.. చట్టప్రకారం జరగాల్సిన ప్రొసెస్ జరగాల్సిందే. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకొని.. కేసుల్ని కొట్టేస్తే అది వేరే సంగతి. అలాంటి నిర్ణయం తీసుకునే వరకూ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది.
ఉద్యమం ఏదైనా కానీ హింసాకాండకు పాల్పడిన వారిని కాపాడాలని.. రక్షించాలని ఏ ఉద్యమ నేత చెప్పరు. కేసీఆర్ లాంటి ఉద్యమకారుడు కూడా.. ఉద్యమాన్ని హింసకు దూరంగా చేపట్టాలని భావిస్తారు. హింసకు పాల్పడే వారిని ఆయన గట్టిగా విమర్శించి.. అలాంటి వారిని ఉద్యమానికి దూరంగా ఉండేలా చేస్తారు.అంతేకానీ.. ఉద్యమంలో భాగంగా హింసకు పాల్పడిన వారిని రక్షించాలని.. వారి మీద కేసులు ఎత్తి వేయాలని.. వారిని అదుపులోకి తీసుకోకూడదంటూ ఉద్యమం చేసింది లేదు.
కానీ.. అందుకు భిన్నంగా ముద్రగడ వ్యవహరించారు. తుని ఎపిసోడ్ లో రైలు దహనం చేయటం.. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్ని తగలెట్టటం.. ధ్వంసం చేసిన ఘటనలకు సంబంధించి బాధ్యత ఉన్న వారిని అరెస్ట్ లకు వ్యతిరేకంగా దీక్ష చేపట్టారు. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని.. కేసులు ఎత్తేయాలన్నది ఆయన తాజా దీక్ష డిమాండ్లన్నది మర్చిపోకూడదు. ముద్రగడ డిమాండ్లకు.. ఒత్తిడికి తలొగ్గి.. ప్రభుత్వం కేసులు ఎత్తేస్తే.. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేస్తే.. సమాజానికి మనం పంపే సంకేతాలు ఏంటి? అన్నది ఇక్కడో పెద్ద ప్రశ్న.
ఇదొక అంశం అయితే.. ఇప్పుడు మాట్లాడుతున్న విపక్షాలకు చెందిన కాపు నేతలంతా ముద్రగడ ఇంటి తలుపులు బద్ధలు కొట్టటం.. అమానవీయంగా ముద్రగడను ఆయన కుటుంబ సభ్యులను అరెస్ట్ చేశారంటూ ఆందోళన చెందుతున్నారు. తన దీక్షను భగ్నం చేస్తే.. పురుగుల మందు తాగుతానని ముద్రగడ బెదిరించటం మర్చిపోకూడదు. బెదిరింపులకు మాత్రమే కాదు.. చేతిలో పురుగుల మందు డబ్బా పట్టుకొని మరీ ఉన్నప్పుడు.. అధికారయంత్రాంగానికి ఎంత వణుకు ఉంటుంది. ఇక్కడ ముద్రగడ వ్యక్తి కాదు.. ఆయన ఒక సామాజిక వర్గానికి ఐకానిక్ నేత. అలాంటి నేతకు జరగరానిది ఏదైనా జరిగితే దాని విపరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ముందస్తు జాగ్రత్తగా ముద్రగడను అరెస్ట్ చేయటం జరిగిందన్న విషయాన్ని మర్చిపోకూడదు. తలుపులు వేసుకొని.. పురుగుల మందు డబ్బాను చేతిలో పట్టుకొని బెదిరిస్తున్న ఒక నేతను అరెస్ట్ చేయటానికి ఇంటి తలుపులు బద్ధలు కొట్టటానికి మించిన ప్రత్యామ్నాయం ఏం ఉంటుంది? అంత జరిగిన తర్వాత.. వారిని అదుపులోకి తీసుకోవటానికి ఎంతోకొంత ప్రతిఘటన ఎదురుకావటం జరుగుతుంది.
దాన్ని హ్యాండిల్ చేసేటప్పుడు కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కాకుంటే.. ఇది చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. తెలంగాణ ఉద్యమం సమయంలో అసెంబ్లీలో టీఆర్ ఎస్ నేతలు మొండిగా వ్యవహరిస్తే.. వారిని బయటకు తరలించే క్రమంలో.. హరీశ్ మొదలుకొని చాలామంది టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలకు చిన్న చిన్న గాయాలు అయ్యేయి. ఎందుకంటే.. భద్రతా సిబ్బంది వారిని బయటకు తరలించే క్రమంలో వారంతా విరుచుకుపడటం.. వారిని ఒడుపుగా పట్టుకొని తరలించేందుకు ఇబ్బంది పడేవారు. దీంతో.. చిన్న చిన్న గాయాలు అయ్యేది. అలాంటి సందర్భాల్లో అప్పటికప్పుడు కాస్త సీరియస్ అయ్యే వారే కానీ.. ఉద్యమంలో దాన్నో అంశంగా ఎప్పుడూ చేర్చలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు.
మొత్తంగా.. ఈ రోజు ముద్రగడ చేస్తున్న దీక్ష మీద రాజకీయం చేయాలనుకునే వారు.. ఆయన దీక్ష దేని కోసం షురూ అయ్యిందన్న విషయాన్ని గుర్తించాలే కానీ.. భావోద్వేగంతో ఊగిపోకూడదు. ఉద్యమం కొత్త విధానాలకు.. కొంగొత్త కలల సాకారానికి బాటలు వేసేలా ఉండాలే కానీ అందుకు భిన్నమైన ధోరణుల్ని పెంచేలా ఉండకూడదు. భావోద్వేగం ఉండటం తప్పేం కాదు. కానీ.. అది మొండితనంతో తాము చెప్పిందే జరగాలన్నట్లుగా.. మనం రాసుకున్న చట్టాలకు భిన్నంగా ఉండాలనుకోవటమే పెద్ద తప్పు అవుతుంది. దాన్ని సమర్థించే వారంతా సమాజానికి చేటు చేస్తున్నట్లేనన్న విషయాన్ని మర్చిపోకూడదు.