అచార్య నాగార్జున యూనివర్సిటీలో బ్యాచులర్ ఆఫ్ అర్క్ టెక్ట్ లో మొదటి సంవత్సరం విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్య చేసుకోవటం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆమె సూసైడ్ నోట్ ను చూసి ఏపీ విద్యా మంత్రి గంటా సైతం స్పందించటం.. విచారణ పక్కాగా జరగాలని ఆదేశించటం జరిగాయి.
చిన్న చిన్న కారణాలకే రిషికేశ్వరి ఆత్మహత్య చేసుకుందన్న మాటలోనిజం లేదని.. ఆమె సూసైడ్ వెనుక విపరీతమైన వేదన.. సీనియర్ అకృత్యాలు ఉన్నట్లు తేల్చారు. ర్యాగింగ్ లో భాగంగా రిషికేశ్వరిని సీనియర్లు అయిన అబ్బాయిలే కాదు అమ్మాయిలు సైతం దారుణంగా హింసించారన్న విషయం తాజాగా విచారణలో బయటకు రావటం సంచలనం సృష్టిస్తోంది.రిషికేశ్వరికి మొదటి నుంచి డైరీ రాసే అలవాటు ఉండటంతో ఆమె పడిన వేదన విచారణ అధికారుల దృష్టికి వచ్చింది. ఆమెకు ఎదురైన ఘటనలు చూసి.. పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్న పరిస్థితి.
సీనియర్ల ర్యాగింగ్ చేసినప్పటికీ.. ఆత్మహత్య చేసుకోవటానికి ముందు రోజు ఘటనే.. సూసైడ్ కి కారణమని తెలుస్తోంది. జూలై 14న ఆత్మహత్య చేసుకోవటానికి ముందు రోజు ఆమె సినిమాకు వెళ్లారు. ఈ సందర్భంగా ఒక సీనియర్ విద్యార్థి ఆమె నడుంపై చేయి వేసి విసిగించటంతో.. ఆమె సినిమా మధ్యలో హాస్టల్ కు వచ్చేశారు.
సినిమా అయిపోయిన తర్వాత సీనియర్ అబ్బాయిల ఆదేశాలతో.. అమ్మాయిలు రిషికేశ్వరిని అర్థనగ్నంగా హాస్టల్ ప్రాంగణంలో తిరగాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. సీనియర్ల మాటను వినకుండా ఉన్నందుకు ఈ శిక్ష తప్పదని చెప్పటమే కాదు.. బిక్కచచ్చి వారి మాట విన్న రిషేశ్వరి అర్థనగ్నంగా తిరిగింది. దీనికి సంబంధించిన వీడియోను కొందరు సీనియర్ అమ్మయిలు చూపించారు.
అబ్బాయిలు చెప్పిన ఆదేశాల్ని పాటించామని చెప్పటానికే ఈ పని చేసి ఉంటారని భావిస్తున్నారు. పక్కరోజు రిషేశ్వరికి చెందిన అర్థనగ్న వీడియోను సీనియర్ అబ్బాయిలకు అమ్మాయిలు చూపించటం.. వారు దాన్ని తమ మొబైల్కు ట్రాన్సఫర్ చేసుకోవటం.. ఈ విషయాలు తెలిసిన రిషేశ్వరి తీవ్రమైన మానసిక వేదనతో.. హాస్టల్ లోని ఫ్యాన్ కి ఊరేసుకొని చనిపోయింది. కరుడుగట్టిన నేరస్తులు మాత్రమే కొన్ని దారుణాలు చేస్తామని అనుకుంటాం కానీ.. మన చుట్టూ ఎంత ప్రమాదకరమైన సమాజం ఉందో తాజా ఉదంతం చెప్పకనే చెబుతోంది.