పోలింగ్ పూర్తి అయిన తర్వాత రాజకీయ నేతలు తలా ఒక దేశానికి విహార యాత్రలకు వెళ్లిపోయారు. పైకి కనపడటం లేదు కానీ.. చాలామంది పొలిటీషియన్స్ విదేశాలకు వెళ్లిపోయారు ఇప్పటికే. ఏ కొందరు మాత్రమే ఇండియాలో, అందునా ఏపీలో ఉన్నారు. ఇప్పటికే ఏపీలో పోలింగ్ పూర్తి అయ్యి రెండో వారం పూర్తి కావొస్తోంది.
ప్రధాన పార్టీ రాజకీయ నేతల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్విస్ పర్యటనకు వెళ్లినట్టుగా తెలుస్తోంది. కుటుంబంతో సహా జగన్ స్విట్జర్లాండ్ కు వెళ్లారు. ఇక్కడి మండుటెండల్లో ప్రచార పర్వాన్ని సాగించిన జగన్ అక్కడ మంచుకొండల్లో సేదతీరుతున్నట్టుగా ఉన్నారు.
ఆ సంగతలా ఉంటే.. నారా ఫ్యామిలీ మాత్రం దేశం దాట లేదు. హిమాలయాలకు విహారానికి వెళ్లింది. సిమ్లాలో సేదతీరుతున్నట్టుగా ఉంది. ఎందుకలా… ముందుగా నారా ఫ్యామిలీ కూడా విదేశాలకే వెళ్లే ప్లాన్ చేసిందట. అయితే జగన్ విదేశాలకు వెళితే తెలుగుదేశం పార్టీ వాళ్లు నానా మాటలు అన్నారు. నల్లధనం దాచడానికి అంటూ చెప్పుకొచ్చారు. జగన్ అలా విమర్శించి తాము మళ్లీ విదేశానికి వెళితే అప్పుడు బుక్ అయ్యేది తామే కాబట్టి.. విదేశీ విహారాన్ని మానుకున్నట్టుగా తెలుస్తోంది.
అలాగే ఇప్పుడు విదేశాలకు వెళ్లి విహరించే మూడ్లో లేరట నారా లోకేష్. మంగళగిరి ఫలితమే అందుకు కారణమని సమాచారం. అక్కడ లోకేష్ కు ఏ రెండు శాతమో ఎడ్జ్ ఉందని తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా సర్వేలు కూడా చెప్పాయట. దీంతో తనవితీరా విహారాలకు వెళ్లే ఆలోచన చేయలేదట లోకేష్. పొలిటికల్ కెరీర్ టెన్షన్లో ఉండటంతో లోకేష్ విదేశీ విహారాన్ని క్యాన్సిల్ చేసుకుని.. ఈ ఎండల వేడిమి నుంచి బయట పడటానికి సిమ్లా వరకూ మాత్రమే వెళ్లినట్టుగా భోగట్టా!