గ్యాంగ్ స్టర్ నయీం ఎంత భయంకరమైన క్రిమినల్ అని చెప్పటానికి పెద్ద పెద్ద ఉదాహరణలు అస్సలు అక్కర్లేదు. అతను ఎన్ కౌంటర్ అయి నాలుగు రోజులు తర్వాత కూడా అతనికున్న మొత్తం ఆస్తుల లెక్కల్ని అధికారులు తేల్చలేకపోవటం.. తవ్వే కొద్దీ ఆస్తులు గుట్టలు.. గుట్టలుగా బయటపడటంతోనే అతని ‘రేంజ్’ ఏమిటో ఇట్టే అర్థమయ్యే పరిస్థితి. ఇంతకాలం ఇన్ని దారుణాలు చేసిన నయీం ఎలా తప్పించుకున్నాడు? చట్టం అతన్ని ఎందుకు పట్టించుకోలేదు? అదుపులోకి తీసుకోవాల్సిన అధికారులు ఎందుకా పని చేయలేదన్న ప్రశ్నలకు సమాధానాలు దొరకని పరిస్థితి.
ఎన్ని తప్పులు చేసినా పట్టించుకోనట్లు వ్యవహరించిన వ్యవస్థ.. కేవలం రెండు ఘటనలు నయీంకు నూకలు చెల్లేలా చేశాయన్న మాట వినిపిస్తోంది. వార్నింగ్ లతో వేలాది కోట్ల రూపాయిల్ని కొల్ల గొట్టేసిన నయిం.. రూ.100 కోట్ల బెదిరింపు అతడి ప్రాణాల్ని పోయేలా చేసిందన్న మాట రాజకీయ.. పోలీస్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
ఇటీవల నిజామాబాద్ జిల్లాకు చెందిన జెడ్పీటీసీ సభ్యుడ్ని నయీం ముఠా డబ్బులు డిమాండ్ చేయటం.. యాదగిరి గుట్ట ప్రాంతంలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని టార్గెట్ చేసి కోట్లాది రూపాయులు ఇవ్వాలని చెప్పిన ఘటనల్లో వచ్చిన ఫిర్యాదులే నయీం మీద ఫోకస్ చేసేలా చేసిందని చెబుతున్నప్పటికీ అసలు కారణం వేరే ఉందన్న మాట వినిపిస్తోంది. ఈ మధ్యన ఇద్దరు ప్రముఖ వ్యక్తులను నయీం బెదిరించి భారీమొత్తంలో డబ్బులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేయటం.. తమకు రాష్ట్రంలో అత్యున్నత స్థానంలో ఉన్న రాజకీయ నేతలు తెలుసన్న విషయాన్ని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా మాట వినని నయీం.. ‘‘ఎవరైతే నాకేంటి? డబ్బులు కట్టాల్సిందే’’ అంటూ తీవ్రంగా మండిపడటమే అతనికి మూడేలా చేసిందని చెబుతున్నారు.
రాష్ట్రంలో ఉన్నతస్థాయి రాజకీయ సంబంధాలున్న ఒక పారిశ్రామికవేత్తకు రూ.75 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయటం.. అదే సమయంలో హైదరాబాద్ పరిసరాల్లోని అధికార పార్టీకి చెందిన ఒక ఎంపీని రూ.25 కోట్లు ఇవ్వాలని నయీం డిమాండ్ చేయటం.. ఈ సందర్భంగా ‘‘అడిగినంత ఇవ్వకపోతే నువ్వు అన్నం ఎలా తింటావో చూస్తా’’ అంటూ చేసిన తీవ్ర వ్యాఖ్యలు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లినట్లుగా చెబుతున్నారు. గతంలో నయీం మీద ఫిర్యాదులు వచ్చినా.. ఈ రెండు ఘటనలతో ప్రభుత్వాధినేత ఒక్కసారి ఫోకస్ చేసినట్లు చెబుతున్నారు. మరీ.. బరితెగిస్తున్న వ్యవహారాన్ని చూడాలంటూ స్పష్టమైన ఆదేశాలతో ఆపరేషన్ షురూ చేసిన పోలీసులు కేవలం 48 గంటల్లో నయీం కథను ముగించినట్లుగా చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఒక ప్రముఖ దినపత్రిక సైతం పేర్కొనటం గమనార్హం.
ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. మట్టి చేతికి అంటకుండా వేలాది సెటిల్ మెంట్లు చేసిన నయీంను.. అదే సెటిల్ మెంట్ కోసం పిలిచి ఏసేశారన్న మాట ప్రచారంలో ఉంది. నయీంతో సంబంధాలు ఉన్న ఒక డీఎస్పీస్థాయి పోలీసు అధికారితో ఫోన్ చేయించి.. డీల్ ఉంది చేద్దామని ఎరవేసి పిలిచారని.. అలవాటుగా ‘డీల్’కు రెడీ అయిన నయింను పోలీసులు ‘డీల్’ పూర్తి చేసినట్లుగా చెబుతుండటం గమనార్హం. అలా వేలాది డీల్స్ ను విజయవంతంగా పూర్తి చేసిన నయిం ఒక డీల్ లో అడ్డంగా బుక్ అయ్యారని తెలుస్తోంది.