ప‌వ‌న్ దారుణంగా ఓడారా? త‌ప్పులో కాలేసిన‌ట్లే!

Update: 2019-05-26 05:30 GMT
ఏపీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ దారుణ ఓట‌మికి గుర‌య్యార‌న్న మాట ప్ర‌తి ఒక్క‌రి నోటి నుంచి వ‌స్తోంది. సామాన్యుల మొద‌లు మీడియా ప్ర‌తినిధులంతా చాలానే లెక్క‌లు వేస్తూ.. ఆయ‌న ఓట‌మి ఎంత పెద్ద‌దో చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో కొంద‌రు ప్ర‌ముఖులు అయితే ప‌వ‌న్ సోద‌రుడు చిరు ప్ర‌స్తావ‌న తెచ్చి.. ప్ర‌జారాజ్యం వ‌ర్సెస్ జ‌న‌సేనను పోలుస్తూ.. మెగా బ్ర‌ద‌ర్ ఓట‌మి ఎంత భ‌యంక‌ర‌మైన‌దో విశ్లేషించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ దారుణ ఓట‌మికి గుర‌య్యార‌న్నదే మీ మాట అయితే.. మీరు క‌చ్ఛితంగా త‌ప్పులో కాలేసిన‌ట్లే. కోట్లాది మంది మారితే మీరు పొర‌పాటు ప‌డిన‌ట్లే. ఎందుకంటే.. ప‌వ‌న్ ఓట‌మికి సంబంధించి చాలామంది మిస్ అవుతున్న కీల‌క‌మైన పాయింట్ ఒక‌టి ఉంది.

సంప్ర‌దాయ రాజ‌కీయ పార్టీల మాదిరి ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఆ పార్టీ వారు డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టింది లేద‌న్నది మ‌ర్చిపోకూడ‌దు. ద‌క్షిణాదిలోని రాష్ట్రాల్లో పోలిస్తే.. ఎన్నిక‌ల సంద‌ర్భంగా భారీగా ఖ‌ర్చు చేసే రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా కీల‌క‌మైన‌వి. ఇటీవ‌ల‌ కాలంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఈ ఖ‌ర్చు అంత‌కంత‌కూ పెరిగిపోతోంది. ఇలాంటివేళ‌లో.. ఓటుకు డ‌బ్బులిచ్చే కార్య‌క్ర‌మానికి పుల్ స్టాప్ పెట్టారు ప‌వ‌న్‌. అంతేకాదు.. అంద‌రూ ప్ర‌స్తావిస్తున్న ప్ర‌జారాజ్యం ఫ‌లితాల‌తో జ‌న‌సేన‌ను పోల్చేస్తున్నారు. కానీ.. మిస్ అవుతున్న పాయింట్ ఏమిటంటే.. ప్ర‌జారాజ్యం పోటీ చేస్తున్న‌ప్పుడు.. ఆ పార్టీ టికెట్ కోసం భారీ ఎత్తు డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టాల్సి వ‌స్తోంద‌న్న ఆరోప‌ణ‌లు పెద్ద ఎత్తున వ‌చ్చాయి. పార్టీకి ఫండ్ ఇచ్చిన వారికే టికెట్లు ఇచ్చార‌న్న ఆరోప‌ణ‌లు పెద్ద ఎత్తున వినిపించాయి. కానీ.. జ‌న‌సేన విష‌యంలో అలాంటి విమ‌ర్శ‌.. ఆరోప‌ణ ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా రాలేదు.

ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలు ఓట్ల కోసం పెట్టిన ఖ‌ర్చు పెద్ద ఎత్తున ఉంటే.. జ‌న‌సేన మాత్రం అందుకు భిన్నంగా నామ‌మాత్రంగానే ఖ‌ర్చు చేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎన్నిక‌ల వేళ‌.. ఓట్ల‌కు డ‌బ్బులు ఇవ్వ‌కుండా ఇంత భారీగా ఓట్లు ప‌డ‌టం అంటే చిన్న విష‌యం కాదు. అయితే.. ప‌వ‌న్ నుంచి అద్భుతాలు ఆశించిన దాంతో పోలిస్తే.. తాజా ఫ‌లితాలు బాధిస్తాయి. అలా అని.. డ‌బ్బులు ఖ‌ర్చు చేయ‌కుండ ఈ మాత్రం ఓటింగ్ కు ప‌వ‌న్ పార్టీ సొంత‌మైందంటే అదో గొప్ప విష‌యంగా చెప్ప‌క త‌ప్ప‌దు. ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన‌ప్పుడు కోట్లాది రూపాయిలు కుమ్మ‌రించే వేళ‌లో.. అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించే నేత‌కు ఓట్లు ప‌డ‌టం మామూలు విష‌యం కాదు. దాన్ని అధిగ‌మించ‌టంలో జ‌న‌సేన అధినేత ఫుల్ స‌క్సెస్ అయ్యార‌ని చెప్పాలి.
Tags:    

Similar News