ప‌వ‌న్ రైలు టూరు..తుని వ‌ర‌కే ఎందుకు?

Update: 2018-11-01 14:32 GMT
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీల‌క ప‌రిణామంతో తెర‌మీద‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.మంగళవారం సాయంత్రం హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో ఫేస్‌బుక్ అఫీషియల్ పేజీని ప్రారంభించిన ప‌వ‌న్ ఈ సంద‌ర్భంగా ఈ పేజీ ద్వారా పార్టీ సిద్దాంతాలు - తన ఆలోచనలను పంచుకుంటామ‌న్నారు. పార్టీ కార్యక్రమాలను కూడా తెలియచేస్తామ‌ని పేర్కొంటూ ఈ పేజీలో తొలి విషయంగా తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు సంబంధించిన అప్‌ డేట్ పోస్ట్ చేశారు. నవంబర్ 2 వ తేదీన విజయవాడ నుంచి తుని పట్టణానికి రైలులో చేరుకుంటున్నట్లు వెల్లడించారు. అందులో భాగంగా కొన్ని స్టేషన్లలో వివిధ వర్గాల ప్రతినిధులను కలుసుకుంటానని చెప్పారు.

జన్మభూమి ట్రైన్లో పవన్ కళ్యాణ్  'సేనానితో రైలు ప్రయాణం' పేరుతో పలు వర్గాల ప్రతినిధులతో స‌మావేశం కానున్నారు. విజయవాడ నుంచి తుని చేరుకొనే వరకూ పలు వర్గాల ప్రజలతో మాటామంతీ ఉంటుంది. మ‌ధ్యాహ్నం 1 గం.20 ని.లకు రైల్వే పోర్టర్లతో మాట్లాడతారు. ఆ తరవాత మామిడి రైతులు - అసంఘటిత రంగంలో ఉన్న చిరు వ్యాపారులు, రైల్వే వెండర్లతోపాటు - రైలులోని ప్రయాణికులు - చెరకు రైతులు - చేనేత కార్మికులు - విద్యార్థులు - ఏటికొప్పాక బొమ్మల తయారీ కళాకారులతో ఈ ప్రయాణంలో మాట్లాడతారు. అయితే, ప‌వ‌న్ త‌న రైలు ప్ర‌యాణానికి ఈ సంస్థ‌ను ఎంచుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. రైలు ప్ర‌యాణాన్ని తుని వ‌ర‌కు ఎంచుకోవ‌డం ఆయ‌న రాజ‌కీయ ఎజెండాను స్ప‌ష్టం చేస్తోందని ప‌లువురు నెటిజ‌న్లు వ్యాఖ్యానిస్తున్నారు.

గ‌త ఏడాది జ‌న‌వ‌రి 31వ తేదీన తుని ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. కాపులను బీసీ జాబితాలో చేర్చాలని - ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండు చేస్తూ ముద్రగడ పద్మనాభం నిర్వహించిన కాపు ఐక్య గర్జన సంద‌ర్భంగా కాపులను బీసీల్లో చేర్చాలని - కాపు కార్పొరేషన్‌ కి ఏటా రూ.వెయ్యి కోట్లు విడుదల చేయాలన్న ప్రధాన డిమాండ్లను నెరవేర్చే వరకు రైలుపట్టాల మీదే కూర్చుందామంటూ ముద్రగడ పిలుపునివ్వడంతో బహిరంగ సభకు వచ్చిన జనమంతా సమీపంలోని పట్టాలవైపు పరుగులు తీశారు. ఆసమయంలో వచ్చిన రత్నాచల్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైలుకు నిప్పు పెట్టారు. సుమారు ఏడు బోగీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.అదే సమయంలో తుని రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ ను దహనం చేశారు. టౌన్‌ స్టేషన్‌ పైనా దాడిచేసి విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనలో పోలీసు - ప్రైవేటు వాహనాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. రైలు ప్రయాణికులను భయాందోళనలకు గురిచేశారు. ఈ బీతావ‌హ ఘ‌ట‌న నేప‌థ్యంలో రాజ‌కీయ సంబంధ‌మైన కార్య‌క‌లాపాల విషంయ‌లో రైలు అంటేనే ప‌లువురు వ‌ణికిపోతున్నారు. అలాంటిది రైలు ప్ర‌యాణం ఎంచుకోవ‌డం, అది తుని వ‌ర‌కు ప‌ర్య‌టించ‌డం అనేది ప‌లువురిని ఆస‌క్తిక‌రంగా మారింది.

Tags:    

Similar News