రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరూ ఊహించని రామ్ నాథ్ కోవింద్ పేరును ప్రకటించి పలు వర్గాలను ఆశ్చర్యపరిచింది. నిజానికి ఎన్నో పేర్లు తెరపైకి వచ్చాయి. బీజేపీ సీనియర్ నేతలు మురళీమనోహర్ జోషి - సుష్మా స్వరాజ్ - జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము పేర్లను బీజేపీ పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఎన్నో చర్చల తర్వాత బీహార్ గవర్నర్ గా ఉన్న రామ్ నాథ్ పేరును బీజేపీ ప్రకటించింది. దీని వెనుక బలమైన వ్యూహమే ఉందని అంటున్నారు.
రామ్ నాథ్ దళితుడే కాదు రైతుబిడ్డ కూడా. యూపీలోని కోలి సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. వివాదరహితుడిగా పేరుంది. దీంతో ప్రతిపక్ష పార్టీలు నో చెప్పలేని పరిస్థితిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కల్పించారు. ఇక పార్టీ పరంగాచ ఊస్తే యూపీ - బీహార్ లలో బీజేపీకి ఎనలేని సేవలందించారు. పార్టీ దళితవర్గానికి నాయకత్వం వహించారు. యూపీలో ఒకప్పుడు మాయావతి కుల రాజకీయాలకు రామ్ నాథ్ తోనే చెక్ పెట్టాలని బీజేపీ భావించింది. ఇక కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సన్నిహితంగా ఉండటం కూడా ఆయనకు కలిసొచ్చింది. బీహార్ గవర్నర్ గా చేసిన అనుభవం కూడా ఆయనకు పనికొస్తుంది.
సోమవారం బీజేపీ పార్లమెంటరీ బోర్డు రెండున్నర గంటల పాటు సమావేశమై రామ్ నాథ్ పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన జూన్ 23 నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఆయన పేరుపై ఏకాభిప్రాయం సాధిస్తామన్న విశ్వాసాన్ని అమిత్ షా వ్యక్తంచేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/