రేవంత్ రాజీనామా వెనుక వ్యూహం...

Update: 2018-09-06 10:15 GMT
అనుకుంటున్నట్లే తెలంగాణ శాసనసభను రద్దు చేసారు. తెలంగాణ క్యాబినెట్ అసేంబ్లీ రద్దుకు తన ఆమోదం తెలిపింది. అయితే ఈ హడావుడిలో కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తన శాసన సభ్యత్వానికి రాజీనామా  చేస్తున్నట్లు ప్రకటించారు.  అయితే స్పీకర్ అంతుబాటులో లేకపోవడం వలన - తన రాజీనామను స్పీకర్ ఫార్మాట్లో అసెంబ్లీ కార్యదర్శికి అందచేస్తానని ఆయన తెలిపారు. నేడు శాసనసభ రద్దు చేస్తారని ముందుగా ఊహించిందే, అయితే శాసనసభ రద్దుకు ముందు రేవంత్ రెడ్డి రాజీనామ చేయడంపై ఆయన వ్యూహం ఏమిటా అని సర్వత్ర ఆసక్తి నెలకొంది. మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి నమ్మిన బంటు - అంతే కాదు తెలంగాణ ముఖ్యమంత్రిని తన మాటలతో ఇరుకున పెట్టగల సామార్ద్యం కూడా ఆయన సొత్తు. శాసనసభ రద్దుకు నిర్ణయం - ముందస్తుకు పార్టీలన్నీ కూడా తమతమ ప్రణాలికలు తయారు చేసుకుంటున్నాయి. అలాగే రేవంత్ రెడ్డి రాజీనామ ఎన్నికల ప్రణాలికలో భాగమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  మొదట నుంచీ రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబ పాలనపై తీవ్ర అసంత్రుప్తితో ఉన్నారు. శాసన సభ రద్దుకు ముందే  రాజీనామ చేసీ - కేసీఆర్ కుటుంబ పాలనపై తన తీవ్ర అసంత్రుప్తిని తెలియజేయడానికి ఇది ఒక అస్త్రం అని విశ్లేషకుల అంచనా.

మహాబూబ్‌ నగర్ జిల్లాలో రేవంత్ రెడ్డి చాలా బలమైన  నాయకుడు - ఆయన తన నియోజకవర్గంలో ఏ పార్టీ నుంచి పోటి చేసిన గెలుపు ఖయంమనే వాదన గట్టిగా ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి రాజీనామా నిర్ణయంతో ఆయన కేంద్ర కాంగ్రెస్ అధిష్టానంలో కళ్లలో పడవచ్చు. అంతేకాకుండా  తెలుగు రాష్ట్రాలలో రెడ్డి సామాజిక వర్గంతో కాంగ్రెస్ పార్టీకి మంచి అనుబంధం ఉంది. తన ఈ రాజీనామా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంథీ ద్రుష్టిలో పడడమే కాకుండా - ఆయనకు చేరువ చేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి.   అంతే కాదు ఈ రాజీనామాతో కేసీఆర్‌ ను నైతికంగానే ఎదురుకుని - రాబోయే ఎన్నికలలో తన నియోజకవర్గంలో తానేంటో నిరూపించుకోవచ్చు. అంతేకాదు తెలంగాణలో రేవంత్ రెడ్డికి మంచి ఓటు బ్యాంక్ ఉంది - ఈ విషయం తెలంగాణలోని కాంగ్రెస్ పెద్దలకు కూడా తెలుసు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్తితులలోను రేవంత్ రెడ్డిని వదులుకునే అవకాశం లేదు.
Tags:    

Similar News