సత్తు పల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య.. నిజానికి టీఆర్ ఎస్ అన్నా.. కేసీఆర్ అన్నా పగతో రగిలిపోవాలి.. కానీ యూ టర్న్ తీసుకున్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డితోపాటు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న సండ్రను టీఆర్ ఎస్ అధినేత - కేసీఆర్ రాజకీయ ఉచ్చులో బలి చేశారు. ఏపీ సీఎం చంద్రబాబును టార్గెట్ చేసిన క్రమంలో రేవంత్ - సండ్ర సహా టీడీపీ నేతలు పావులయ్యారు. అయితే రేవంత్ మాత్రం కేసీఆర్ పై పగతో రగిలిపోతుండగా.. సండ్ర మాత్రం స్నేహగీతం ఆలపిస్తున్నారు..
కేసీఆర్ రెండోసారి అఖండ మెజార్టీ సాధించాక సండ్ర పూర్తిగా మారిపోయారు. గులాబీ బాస్ తో పోరాడితే లాభం లేదని నిర్ణయానికి వచ్చారు. సత్తుపల్లి నుంచి అదే మెజార్టీతో సండ్ర కూడా రెండోసారి గెలిచాక.. ఇక టీడీపీని నమ్ముకుంటే లాభం లేదని నిర్ణయానికి వచ్చారు. అందుకే పక్కనే ఉన్న అశ్వరావుపేట టీడీపీ ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావును టీఆర్ ఎస్ లో చేరుదామని ప్రతిపాదించారట. కానీ ఆయన నో అనడం.. అదే సమయంలో టీఆర్ ఎస్ నుంచి ఆఫర్ రావడంతో పలుమార్లు టీఆర్ ఎస్ పెద్దలతో సమాలోచనలు చేశారని వార్తలొచ్చాయి..
తాజాగా సీఎం కేసీఆర్ ను ప్రగతి భవన్ లో సండ్ర కలవడం హాట్ టాపిక్ గా మారింది. టీఆర్ ఎస్ లో చేరేందుకు దాదాపు నిర్ణయించుకున్న సండ్ర.. చంద్రబాబు ఇచ్చిన అత్యంత ప్రతిష్టాత్మక టీటీడీ బోర్డు డైరెక్టర్ పదవిని కూడా కాలదన్నుకోవడం విశేషం. అయితే సండ్ర టీఆర్ ఎస్ లో చేరి మంత్రి పదవి కొల్లగొట్టేందుకు స్కెచ్ గీశారని సమాచారం.
టీఆర్ ఎస్ లో చేరడం వల్ల సండ్రకు రెండు ఉపయోగాలున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఒకటి తనపై ఉన్న ఓటుకు నోటు కేసు నుంచి విముక్తి కావడం.. రెండు.. ఖమ్మం జిల్లాలో అతీగతీ లేని టీఆర్ ఎస్ కు వెన్నుముక అయ్యి మంత్రి పదవి చేపట్టడం.. ఈ రెండు టార్గెట్ గానే సండ్ర కారు ఎక్కేందుకు రెడీ అయ్యారని సమాచారం. అందుకే కేసీఆర్ ను కలిశారట. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి కొట్టేయాలన్న సండ్ర ఆశలను కేసీఆర్ తీరుస్తారో లేదో చూడాలి మరి.