శివసేన యూటర్న్ కి అసలు కారణం ఏంటంటే !

Update: 2020-02-03 14:30 GMT
పౌరసత్వ సవరణ చట్టం పై దేశవ్యాప్తంగా ఇంకా ఆందోళనలు  జరుగుతూనే ఉన్నాయి. కొందరు ఈ చట్టానికి మద్దతు తెలుపుతుండగా ..మరికొంతమంది మాత్రం ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ చట్టం పై మహారాష్ట్ర సీఎం - శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే  ఎవ్వరు ఊహించని విధంగా ఉన్నట్టుండి యూటర్న్ తీసుకున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ లోక్‌ సభలో ఓకే అన్నా... రాజ్యసభలో మాత్రం ఓ మెలిక పెట్టి బీజేపీకి షాక్ ఇచ్చింది. అయితే ఉన్నట్లుండి  సీఎం ఉద్ధవ్ ఠాక్రే సీఏఏకు మద్దతు పలికారు.

శివసేన అధికారిక పత్రిక అయిన సామ్నా ఇంటర్వ్యూలో ఆయన  ఈ విధమైన సంకేతాలు ఇచ్చారు. మహారాష్ట్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ బిల్లుకు ఎంతమాత్రమూ వ్యతిరేకం కాదని - అయితే మిగితా రెండు విషయాలైన ఎన్పీఆర్ - ఎన్నార్సీ కి వ్యతిరేకం అని  స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టం అనేది దేశం నుంచి ఏ ఒక్కరినీ తరిమేసే చట్టం ఎంతమాత్రం కాదు. అయితే మహారాష్ట్రలో ఎన్నార్సీని మాత్రం మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే హిందువులు కూడా తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవడం కష్టమే అని  తెలిపారు.

అసోం ఎన్నార్సీ జాబితాలో కూడా చాలా మంది హిందువుల పేర్లు గల్లంతయ్యాయని - ముస్లింలకే కాదు - హిందువులకు కూడా తమ పౌరసత్వం నిరూపించుకోవడం కష్టమేనని ఆయన తెలిపారు. జాతీయ పౌరసత్వ సవరణ బిల్లుకు మహా వికాస్ అగాఢీ సేన లో ఇతర మిత్ర పక్షాలైన కాంగ్రెస్ - ఎన్సీపీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మొదట్లో శివసేన కూడా దీనిని తీవ్రంగా వ్యతిరేకించాయి. మళ్లీ  ఇప్పుడు అకస్మాత్తుగా  - ఏమైందో  తెలియదు కానీ - హఠాత్తుగా శివసేన సీఏఏకు మద్దతు పలకడంతో ఈ వ్యవహారం ఇప్పుడు  మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.
Tags:    

Similar News