ర‌ణ‌ధీర్ ఇంటికి పోలీసులు ఎందుకు వెళ్లారు?

Update: 2018-10-03 06:58 GMT
మొన్న‌టి వ‌ర‌కూ పెద్ద‌గా ప‌రిచ‌యం లేని ర‌ణ‌ధీర్ రెడ్డి అనే పేరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సుప‌రిచితంగా మారింది. ఇంత‌కీ అత‌గాడు ఎవ‌రంటే.. రేవంత్ రెడ్డికి అత్యంత స‌న్నిహితుడైన ఉద‌య‌సింహ‌కు ద‌గ్గ‌రివాడు. త‌న ర‌హ‌స్యాల్ని అత‌నితోనూ పంచుకునేవాడు. ఇంకా చెప్పాలంటే.. త‌న‌కు సంబంధించి కీల‌క ప‌త్రాలు.. హార్డ్ డిస్క్ లు.. ఇంకేమైనా ముఖ్య‌మైన‌వి ఉన్నా వాటిని అత‌డి ద‌గ్గ‌ర దాచుకునేవాడు.

మ‌రి.. అలాంటి వ్య‌క్తిని స‌రిగ్గా విచారిస్తే.. ఉద‌య‌సింహ గుట్టు మొత్తం ర‌ట్టు అవుతుంది. ఒక్క‌సారి ఉద‌య‌సింహ గుట్టుర‌ట్టు అయితే.. ప‌రోక్షంగా రేవంత్ ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిన‌ట్లే. ఈ కార‌ణంతోనే ర‌ణ‌ధీర్ రెడ్డిని టాస్క్ ఫోర్స్ పోలీసులు టార్గెట్ చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

ఇంత‌కీ.. ర‌ణ‌ధీర్ రెడ్డి గురించి టాస్క్ ఫోర్స్ పోలీసుల‌కు ఎలా తెలిసింది? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. ఈ మ‌ధ్య‌న ఉద‌య‌సింహ అమ్మ‌మ్మ ఒక రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డారు. ఆ స‌మ‌యంలో ర‌ణ‌ధీర్ రెడ్డికి ఫోన్ చేసిన ఉద‌య‌సింహ‌.. అమ్మ‌మ్మ‌ను ఆసుప‌త్రికి తీసుకెళ్లాల‌ని కోరారు.

ఈ సంద‌ర్భంగా ఇరువురు మ‌ధ్య ప‌లుమార్లు మాట‌లు జ‌రిగాయి. క‌ట్ చేస్తే.. తాజాగా ఉద‌య‌సింహ కాల్ డేటాను ప‌రిశీలిస్తున్న అధికారుల‌కు ర‌ణ‌ధీర్ రెడ్డి ఎవ‌ర‌న్న సందేహం క‌లిగింది. ఇన్నిసార్లు ర‌ణ‌ధీర్ రెడ్డితో ఉద‌య‌సింహ‌తో మాట్లాడాడంటే.. ఏదో లింకు ఉంద‌ని అనుమానించారు. విలువైన డాక్యుమెంట్లు ఉండే అవ‌కావం ఉంద‌ని భావించారు. అదే.. ర‌ణ‌ధీర్ రెడ్డి ఇంట్లో త‌నిఖీల‌కు కార‌ణంగా భావిస్తున్నారు.

ఐటీ అధికారుల పేరుతో ర‌ణ‌ధీర్ ఇంట్లోకి ప్ర‌వేశించిన అధికారులు ప‌లు సోదాలు జ‌రిపి.. ప‌లు డాక్యుమెంట్లు.. హార్డ్ డిస్క్.. బంగారు ఆభ‌ర‌ణాలు స్వాధీనం చేసుకున్నారు. అనంత‌రం అదుపులోకి తీసుకొని.. 24 గంట‌ల పాటు త‌మ వ‌ద్ద ఉంచుకొని ప‌లు ప్ర‌శ్న‌లు వేసి త‌ర్వాత ఇంటి వ‌ద్ద వ‌దిలిపెట్టేశారు.

అయితే.. ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్న ర‌ణ‌ధీర్ ను త‌ర్వాత ఎక్క‌డ ఉంచారో బ‌య‌ట‌కు వెల్ల‌డించ‌లేదు. ఇదే స‌మ‌యంలో ర‌ణ‌ధీర్‌ కుటుంబ స‌భ్యులు ఎల్ బీన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు ఇస్తే.. తీసుకునేందుకు నిరాక‌రించారు. మ‌ళ్లీ సోమ‌వారం రాత్రి అత‌న్ని ఇంటి ద‌గ్గ‌ర విడిచిపెట్టి.. తాము రోడ్డు మీద అనుమానంగా తిరుగుతుంటే అదుపులోకితీసుకున్న‌ట్లుగా చెప్ప‌టం వివాదాస్ప‌ద‌మైంది.

మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. రాచ‌కొండ ప‌రిధిలోకి హైద‌రాబాద్ పోలీసులు వెళ్లి విచారించ‌టం. . అదుపులోకి తీసుకోవ‌టం. టాస్క్ పోర్సు మొత్తం సీపీ ప‌రిధిలో ఉంటుంది. అలాంటిది ఒక సంబంధం లేని ప‌రిధిలోకి వెళ్లిన టాస్క్ ఫోర్స్ సిబ్బంది ర‌ణ‌ధీర్ ను అదుపులోకి తీసుకోవ‌టం.. ఇంట్లో అదుపులోకి తీసుకొని.. రోడ్డు మీద అదుపులోకి తీసుకున్న‌ట్లుగా చెప్ప‌టం లాంటివి చూసిన‌ప్పుడు ప‌లు సందేహాలు వ్య‌క్తం కావ‌ట‌మే కాదు.. ఇప్పుడీ విష‌యం మొత్తం వివాదాస్ప‌దంగా మారింది. స్థానిక పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌కుండా ర‌ణ‌ధీర్ ను వేరే ప్రాంతానికి చెందిన పోలీసులు అదుపులోకి తీసుకోవ‌టం ఎందుకు? అన్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్ మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
   

Tags:    

Similar News