మాంసం ధరలతో సమానంగా రేటు పెరిగిపోయి సామాన్యులను భయపెట్టిన కందిపప్పు ఎందుకలా చుక్కలను తాకిందన్నది తేలింది. కందిపప్పు కృత్రిమ కొరతకు కారణమైన వేల కోట్ల రూపాయల కుంభకోణం ఇపుడు బయటపడింది. అయిదు నెలల కిందటే మీడియాలో దీనిపై అనుమానాలు వ్యక్తమైనా ఇంతవరకు నిజాలు నిగ్గు తేలలేదు. తాజాగా ప్రభుత్వ నిఘా వర్గాలు పరిశోధించి అసలు నిజాలు తేల్చడంతో కందిపప్పు ధరల వెనుక ఇంటర్నేషనల్ మాఫియా పనిచేసిందని తేలింది.
ఫ్యూచర్ మార్కెట్ లలో ధరలు పెరిగేలా చేసే పన్నాగం బహిరంగ మార్కెట్లపైనా పడి సామాన్యులను నానా బాధలు పడేలా చేసింది. విదేశాలలో ఉన్న మార్కెట్ రేటు కంటే ఎక్కువకు కందులను కొనుగోలు చేసిన దిగుమతిదారులు ఆ సరకును వెంటనే భారత్ కు తీసుకురాకుండా కెనడా - దుబాయ్ లలో దాచేశారు. మార్కెట్ ధర కంటే ఎక్కువకు కొనుగోలు చేయడంతో అక్కడ ధరలు పెరిగాయి. ఫలితంగా అంతర్జాతీయంగా ధరలు పెరిగాయి. కానీ.... సరకు ఇండియాకు చేరకుండా అడ్డుకోవడంతో ఇక్కడ మరింత ధరలు పెరిగాయి.
అలాగే ముంబై పోర్టులో పప్పు దిగుమతి చేసుకున్నా అన్ లోడ్ చేయకుండా ఉంచేశారు. మనదేశం ప్రధానంగా దాదాపు 80 శాతం కందులను కెనడా నుంచి దిగుమతి చేసుకుంటుంది. పప్పుధాన్యాల ట్రేడింగ్ చేసే ఇండియన్ కంపెనీలు కెనడాలో మార్కెట్ ధరకంటే ఎక్కువకే కొనుగోలు చేశాయి. దీంతో అక్కడ ధరలు పెరిగాయి. మరోవైపు కొనుగోలు చేసిన పప్పు ధాన్యాలు భారత్ కు తీసుకురాకుండా కెనడాలోనే ఉంచేశారు. ఇతర దేశాలనుంచి దిగుమతి చేసుకునే కందులను కూడా దబాయ్ లో దాచేసినట్లు నిఘా వర్గాల దర్యాప్తు లో వెల్లడైంది. ఇలా వేల టన్నుల పప్పు ధాన్యాలను దాచేయడంతో భారత లో ఫ్యూచర్స్ మార్కెట్ లో కందులతో పాటు ఇతర పప్పుధాన్యాల ధరలు గణనీయంగా పెరిగాయి. మీడియా సంస్ధలు అపుడే గగ్గోలు పెట్టినా ..పెడచెవిన పెట్టిన ప్రభుత్వం ఇపుడు ఇంటెలిజెన్స్ నివేదికపై ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. దీంతో పాటు ఇండియాలోనూ పెద్ద ఎత్తున సరకును దాచేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జరిపిన దాడుల్లో 1.3 లక్షల టన్నుల కందిపప్పు స్వాదీనం చేసుకున్నారు. కృత్రిమ కొరత సృష్టించాలన్న దురుద్దేశంతో దాచిపెట్టిన సరకు ఇదంతా. విదేశాల్లో కిలో రూ.100 అంతకంటే తక్కువకు కొనుగోలు చేసి దిగుమతి చేసుకున్న ఆ సరకును మార్కెట్ కు తరలించకుండా దాచారు. దేశీయ దిగుమతిదారులు, అంతర్జాతీయ దళారులు అంతా కలిసి కందిపప్పు ధరల పెరుగుదలకు కారణమయ్యారు. ఆలస్యంగానైనా గుట్టు బయటపడడంతో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.