వైఎస్సార్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి.. పార్టీ ఆదేశిస్తే గనుక.. కుప్పంలో చంద్రబాబునాయుడు మీద పోటీ చేయడానికి సిద్ధం అని ప్రకటించిన వైనం.. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనాలు సృష్టిస్తోంది. ఆయన సవాలును తెదేపా నాయకులు ఎద్దేవా చేయడం ప్రతిసవాళ్లు విసరడం రివాజుగా జరుగుతోంది. అయితే కుప్పంలో చంద్రబాబునాయుడు మీద గెలవడం అనేది అసాధ్యం అని తెలిసినప్పటికీ కూడా... విజయసాయి అంత ధీమాగా సవాలు చేయడం వెనుక ఒక చిన్న మతలబు ఉన్నదని పలువురు విశ్లేషిస్తున్నారు. కుప్పం సీటు పోయినా - చిత్తూరు ఎంపీ సీటును దక్కించుకోవడం ప్రధానంగా ఎంచి ఈ మాట అని ఉంటారనే ఊహాగానాలు సాగుతున్నాయి.
చంద్రబాబునాయుడు 2019 సార్వత్రిక ఎన్నికల్లో నేరుగా పోటీచేయకుండా.. లోకేష్ ను కుప్పం నుంచి బరిలో దింపుతారని... తాను ఖాళీగా ఉండి.. ఎన్నికల ప్రచారాన్ని మాత్రం భుజాన వేసుకుని.. ఫలితాలు వచ్చేదానిని బట్టి సందుచిక్కితే కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పేలా కీలకంగా వెళ్లాలని అనుకుంటున్నట్లుగా కొన్ని పుకార్లు ఉన్నాయి. అదేసమయంలో... కేసీఆర్ లాగా బయటకు ప్రకటించకపోయినప్పటికీ.. కేసీఆర్ లాగా కేంద్రంలో ఉండాలనే కోరిక ఉన్నదని.. అదే జరిగితే సీఎంగా లోకేష్ ను చేస్తారని, కేంద్రంలో పాచిక పారకపోతే.. తిరిగి తాను సీఎంగా వచ్చి తర్వాత ఎక్కడో ఓ చోట నెగ్గుతారని కూడా ఊహాగానాలున్నాయి.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. చంద్రబాబునాయుడు మీద విజయసాయి పోటీకి సిద్ధపడడంలో కీలకం.. చిత్తూరు ఎంపీ సీటు గెలవడమే అని అనుకుంటున్నారు. చిత్తూరు ఎంపీ పరిధిలో అన్నిచోట్లా తెదేపా ఓడినా.. కుప్పంలో చంద్రబాబు సాధించే మెజారిటీతోనే.. చిత్తూరు ఎంపీ స్థానాన్ని కూడా గెలుస్తుంటుంది. అలాంటి నేపథ్యంలో.. కుప్పంలో చంద్రబాబు మెజారిటీకి కొంత మేరకు గండికొట్టగలిగితే గనుక.. వైఎస్సార్ కాంగ్రెస్ కు అది ప్లస్ పాయింట్ అవుతుంది. చిత్తూరు ఎంపీ సీటును వైకాపా గెలుచుకోగలుగుతుంది అని వారు లెక్కలు వేస్తున్నట్లు అర్థమవుతోంది.
ఒకవేళ ఊహాగానాలు నిజమై.. కుప్పం నుంచి లోకేష్ బరిలోకి దిగితే గనుక.. తన సవాలుకు జడిసి చంద్రబాబు తాను పోటీచేయడం లేదంటూ.. విజయసాయి ఎద్దేవా చేయడానికి కూడా వీలవుతుంది. ఇలా రెండు రకాలుగానూ తెదేపాపై పైచేయి సాధించి, లబ్ధి పొందడం కోసం వారు అలాంటి వ్యూహాత్మక ప్రకటన చేసినట్లు పలువురు అనుకుంటున్నారు.