గుంటూరు జిల్లా మంగళగిరిలో ఇటీవలే గృహప్రవేశం చేసారు వైఎస్ జగన్. అయితే అక్కడ ఉండకుండా, వెంటనే హైదరాబాద్ వెళ్లిపోయారు. దీనిపై అధికార టీడీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది. పెద్ద ఎత్తున్న పార్టీలో చేరికలు జరుగుతున్నాయి కనుకే జగన్ హైదరాబాద్ వెళ్లారని ప్రచారం జరిగినా దాని వెనుక ఓ ముఖ్య కారణం ఉన్నట్టు తెలుస్తోంది. అందువల్లే వైఎస్ జగన్ అర్థాంతరంగా కొత్త ఇల్లు కాదని తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు.
మంగళగిరిలో ఇంటి నిర్మాణం జరిగేటప్పుడే ఆ ఆవరణ చుట్టుపక్కల హైపవర్ ఫోన్ ఇంటర్స్టెప్టర్లు ఉన్నట్టు గుర్తించారంటున్నారు. వీటి ద్వారా కొంత దూరంలో ఉన్న ఫోన్ల ఇన్ కమింగ్ కాల్స్, ఔట్ గోయింగ్ కాల్స్ అన్నిటినీ వినొచ్చు. రికార్డు చేయొచ్చు. పార్టీకి చెందిన కొందరు సాంకేతిక నిపుణులు దీన్ని గుర్తించి జగన్ ని అప్రమత్తం చేయడంతో ఆయన తన కార్యకలాపాలను హైదరాబాద్ నుండి నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ పరికరాలను చుట్టుపక్కల చాలా ఉన్నాయని అంటున్నారు. ప్రతిపక్ష నేత కదలికలను, కార్యక్రమాలను తెలుసుకునేందుకు ప్రత్యర్థులు వేసిన ఈ ప్లాన్ ను వైఎస్ జగన్ అట్టర్ ఫ్లాప్ చేసారన్నమాట.