కొద్ది రోజుల క్రితం తెలంగాణ వైసీపీ అధినేత్రి వైఎస్ షర్మిల.. దేశ రాజధాని ఢిల్లీ పర్యటన పెట్టుకోవటం తెలిసిందే. ఎందుకు? దేనికోసం? అన్నప్పుడు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పలు చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన భారీ అవినీతి గురించి కేంద్రానికి కంప్లైంట్ ఇవ్వటం కోసమన్న మాట చెప్పటం..
అందుకు తగ్గట్లే వార్తలు రావటం తెలిసిందే. అయితే.. అందరికి కనిపించింది అదే అయినా.. అంతకు మించి చాలానే ఉందన్న విషయం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతి గురించి ఫిర్యాదులు చేసినట్లు కనిపించినప్పటికీ.. ఆమె ఢిల్లీ టూరు అసలు కారణం.. తన బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసులో వాంగ్మూలాన్ని ఇచ్చేందుకే అన్న విషయం తాజాగా బయటకు వచ్చింది.
అందరికి కాళేశ్వరం మీద కంప్లైంట్ ఇచ్చేందుకు మాత్రమే షర్మిల ఢిల్లీకి వెళ్లారని ప్రచారం జరిగినా.. అందరి అంచనాలకు భిన్నంగా ఆమె వ్యవహరించిన తీరు తాజాగా బయటకు వచ్చి హాట్ టాపిక్ గా మారింది.
వివేకా హత్య కేసులో ఉన్న సున్నిత అంశాలను పరిగణలోకి తీసుకొని.. తాను ఢిల్లీకి వెళుతున్నది వివేకా హత్య కేసులో వాంగ్మూలాన్ని ఇచ్చేందుకు అన్న విషయాన్ని బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్న వైనం చూసినప్పుడు షర్మిల తీరుపై ఇప్పటివరకు ఉన్న అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది.
ఏమైనా రాజకీయాన్నిఒళ్లంతా నింపుకున్న షర్మిల.. తను చేసే పనులకు సంబంధించి అందరికి కనిపించేది ఒకటైతే.. తాను చేసేది మాత్రం తాను కోరుకున్నది మాత్రమే అన్న విషయాన్ని స్పష్టం చేసినట్లుగా చెప్పక తప్పదు. రానున్న రోజుల్లో ఈ తరహాలో మరెన్ని చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.