జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. త్వరలోనే ఏపీలో యాత్ర ప్రారంభించనున్నారు. ఇప్పటికే వాహనం.. వారాహి.. కూడా రెడీ అయింది. ఇంత వరకు ఓకే. కానీ, ఇదేదో.. కేవలం ప్రభుత్వంపై విరుచుకుపడడానికి, వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించడానికి అయితే.. ప్రయోజనం పెద్దగా ఉండకపోవచ్చని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే, ఇప్పటికే వైసీపీ నేతలపై చేయాల్సిన విమర్శలు చేశారు.
అనాల్సిన మాటలు అన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు విన్నారు.. వింటున్నారు కూడా. అయితే, ఇప్పుడు ఏపీ ప్రజలకు కావాల్సింది.. కేవలం వైసీపీని తిట్టడం కాదు. అంతకుమించి ఉన్న ఒక మెట్టుపైకి వెళ్లి.. అక్కడ నుంచి ఏపీని చూడాల్సిన అవసరం ఉందనేది విశ్లేషకుల మాట. అంటే.. ఏపీ ప్రజలు కీలకమైన అనేక అంశాలపై ఆశలు పెట్టుకున్నారు. హోదా.. పోలవరం.. పాతవి వదిలేసినా కొత్తగా అనేక అంశాలు కనిపిస్తున్నాయి.
జిల్లాలను విభజన చేశారు. అయితే, మండలస్థాయిలో ఇప్పటికీ అనేక చిక్కులు ఉన్నాయి. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రతి జిల్లాలోనూ ప్రజలు ఎదురు చూస్తున్నారు. కొన్ని జిల్లాలను అశాస్త్రీయంగా విభజిం చారనే వాదన ఉంది.
దీనిని సరిచేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రబలుతున్న నిరుద్యోగానికి దీటుగా.. నికరమైన ఉద్యోగ నోటిఫికేషన్లను యువత కోరుకుంటున్నారు. అదేవిధంగా నిత్య సమస్యల తోరణంగా ఉన్న రైతన్నల వెతలకు ఏం చెబుతారు?
ప్రధానంగా.. తెలంగాణతో ఏపీ విషయంలో జనసేన అనుసరించే విధానం, జల వివాదాలు, ఆస్తుల పంపకాలు.. విభజన చట్టంలోని అంశాల అమలుకు ఎదురవుతున్న అనేక అడ్డంకులు.. ఇలా అన్ని విషయాలను జనసేన స్పృశించాలనేది ఆ పార్టీలోనే కాదు..ఒక వర్గం మేధావులు కూడా ఆశిస్తున్నారు. వీటిని వదిలేసి.. కేవలం వైసీపీని విమర్శిస్తూ.. కూర్చుంటే.. ఎన్నియాత్రలు చేసినా.. ఫలితం ఆశించినట్టుగా అయితే ఉండదని చెబుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.