తాలిబన్లపైనే తిరుగుబాటు

Update: 2021-08-21 04:40 GMT
వారం రోజుల క్రితం ఆఫ్ఘనిస్ధాన్ను ఆక్రమించిన తాలిబన్లు ఏ మాత్రం ఊహించని ఘటనలు మొదలయ్యాయి. తాలిబన్లను టార్గెట్ చేసుకుని బాగ్లాన్ ప్రావిన్సులోని మూడు జిల్లాలను తాలిబన్ల నుండి తిరుగుబాటుదారులు తిరిగి స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. వారం రోజుల క్రితం మొత్తం దేశాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తాలిబన్ల తాజా చర్యతో 20 సంవత్సరాల స్వేచ్చా, స్వాతంత్ర్యాలకు ఆప్ఘనిస్థాన్ లో బ్రేకులు పడ్డాయి.

ఆప్ఘన్లో అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి తాలిబన్లు అరచాకాలు మొదలుపెట్టారు. తమకు ఎదురుతిరిగిన వారిని కాల్చేస్తున్నారు లేదా ఉరితీస్తున్నారు. ఆప్ఘన్లందరికీ క్షమాభిక్ష ప్రసాదించినట్లు చేసిన ప్రకటన ఉత్తదే అని తేలిపోయింది. షరియా చట్టాలను ఉల్లంఘించిన వారికి బహిరంగంగానే శిక్షలు వేసి అమలు చేస్తున్నారు. గడిచిన వారంలో ఎంతమంది జనాలు తాలిబన్ల చేతిలో చనిపోయారనేందుకు లెక్కలు లేవు. దీంతో తాలిబన్లను ఎదిరించైనా తమ స్వేచ్చా, స్వాతంత్ర్యాలను కాపాడుకోవాలనే తపన జనాల్లో పెరిగిపోతోంది.

దీనికి మద్దతుగా పంజ్ షీర్ లోని తాలిబన్ల వ్యతిరేక దళాలు చేతులు కలిపాయి. పంజ్ షీర్ అంటే రాజధాని కాబూల్ కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోయప్రాంతం. భౌగోళికంగా పంజ్ షీర్ ఖజకిస్తాన్ దేశం పరిధిలోకి వస్తుంది. మొన్నటి వరకు దేశ ఉపాధ్యక్షుడు ముల్రాన్ సలేహ్ ఈ ప్రాంతం నేతే. దేశం తాలిబన్ల చేతులోకి వెళ్ళిపోగానే సలేహ్ పంజ్ షీర్ వెళ్ళిపోయి తన మద్దతుదారులతో భేటీ అయ్యారు. నిజానికి పంజ్ షీర్లను లొంగదీసుకోవాలని తాలిబన్లు ఎన్ని సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదు.

తాలిబన్లను ఎదురించటమే కాదు వాళ్ళ వెన్నులో చలి పుట్టించగలిగిన వాళ్ళు పంజ్ షీర్లు. ఇలాంటి పంజ్ షీర్లు జనాలతో కలిసిపోయి బాగ్లాన్ ప్రావిన్సులో తాలిబన్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు మొదలుపెట్టారు. దాంతో మూడు జిల్లాలను పంజ్ షీర్ నేతృత్వంలోని జనాలు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి తిరుగుబాటు వస్తుందని తాలిబన్లు ఏ మాత్రం ఊహించలేదు. దాంతో మూడు జిల్లాల నుండి తాలిబన్లు ఇతర ప్రాంతాలకు పారిపోతున్నారట. మరి మిగిలిన ప్రాంతాల్లో ఏమవుతుందనేది ఇపుడు ఆసక్తిగా మారింది.


Tags:    

Similar News