మునుగోడుపై క్లారిటీ ఇచ్చేసిన పాల్‌.. ఇక‌, జ‌నానికి కొత్త సీఎం!

Update: 2022-11-05 11:35 GMT
న‌వ్వుల మ‌తాబు.. కేఏ పాల్ గురించి ఎంత న‌వ్వుకున్నా త‌క్కువే! ఆయ‌న న‌డిచినా... మాట్లాడినా.. కిత‌కిత‌లే కిత‌కిత‌లు! ఇక‌, మునుగోడు ఎన్నికలో కేఏ పాల్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఓవైపు నవ్వులు పూయిస్తునే... మునుగోడు బైపోల్‌లో ఉత్సాహంగా పాల్గొన్నాడు. తాజాగా కేఏ పాల్.. కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో 50 వేల ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నట్లు ప్రజశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ధీమా వ్యక్తంచేశారు.లక్షా పది వేల ఓట్లు ఉంగరం గుర్తుకు వేసినట్లు ఆయ‌న చెప్పుకొచ్చారు. మునుగోడులో గెలిస్తే తానే కాబోయే సీఎం అవనున్నట్లు జోస్యం చెప్పారు.

ఉప ఎన్నికల ప్రచార సమయంలో మూడుసార్లు తనపై దాడికి యత్నించారని తెలిపారు. పోలీసులను అడ్డం పెట్టుకుని సీఎం కేసీఆర్‌ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మండిపడ్డారు.

"ఆయనేదో మహాత్మాగాంధీలా, డాక్టర్ అబ్దుల్ కలాంలా, కేఏ పాల్‌లా... నన్ను ఇమిటేట్ చేస్తున్నారు. అసలు కేసీఆర్ ఎవరు.. ఆయనకు మాట్లాడే హక్కు ఉందా.

కానీ ఆయన మాట్లాడిన మాటలు మీరు విన్నారా.. ముందు ఆయన తెలంగాణ ద్రోహి. 4 లక్షల 60వేల కోట్లు మిగిలినవి.. ఆ డబ్బు ఏమయ్యాయి. ఆయనకు గంట రెండు గంటల కవరేజ్ ఎందుకు ఇస్తున్నారు.

నా వీడియోలు కేటీఆర్ ఆన్ ఎయిర్ పోకుండా చేస్తున్నాడు. అందుకే కూసుకుంట్ల ప్రభాకర్‌ను చిత్తు చిత్తుగా ఓడించాం. అందుకే ఆయన స్పీచ్‌లో క్లారిటీ వచ్చేసింది. ఓటములు, గెలుపులు సహజమని నాలుగు సార్లు అన్నారు. ఓడిపోతున్నాడనే అలా చెప్పారు" అని పాల్ క్లారిటీ ఇచ్చేశారు. సో.. పాల్ క్లారిటీ ఇచ్చేసిన నేప‌థ్యంలో జ‌నాల‌కు త్వ‌ర‌లోనే కొత్త సీఎం వ‌చ్చేస్తున్నార‌ని అనుకోవాల‌న్న మాట‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News