తెలంగాణ అబ్బురం.. మాంద్యంలోనూ అద్భుత రాబడి

Update: 2020-02-27 08:35 GMT
ఆర్థికమాంద్యం లేదని చెబుతున్నా దాని లక్షణాలు దేశంలో కనిపిస్తున్నాయి. వృద్ధి రేటు క్షీణించడం, పారిశ్రామిక వృద్ధి తగ్గడం తదితర పర్యవసనాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కూడా తెలంగాణ రాష్ట్రం అద్భుత ప్రగతి కనపరుస్తోంది. జీఎస్టీ పన్ను రాబడిలో తెలంగాణ రాష్ట్రం మిగతా దక్షిణాది రాష్ట్రాల కంటే ముందు నిలిచింది. జీఎస్టీ రాబడులు అత్యధికంగా సాధిస్తోంది. దేశంలో జీఎస్టీ వసూళ్లు తగ్గుతున్నా తెలంగాణలో మాత్రం పెరగడం గమనార్హం.

 ప్రత్యేక యాప్, స్పెషల్ డ్రైవ్‌లతో జీరో దందాను పూర్తిగా నిరోధించి మార్గదర్శకంగా నిలుస్తూ రాబడి పెంచుకుంటోంది. గతేడాది కంటే ఈ సంవత్సరం వృద్ధిరేటు తగ్గినప్పటికీ వాణిజ్య పన్నుల శాఖ చేపట్టిన ప్రత్యేక చర్యల కారణంగా లక్ష్యాన్ని మించి ఖజానాకు ఆదాయం వస్తుండడం విశేషం. దీంతో తెలంగాణ లో ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంది. కేసీఆర్ ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఉన్నాయని ఖర్చులు తగ్గించుకుంటున్న సమయంలో ఈ ఫలితాలు రావడం గమనార్హం. బడ్జెట్ అంచనా లక్ష్యాల్లో 86 శాతం దక్షిణాది రాష్ట్రాలలో జీఎస్టీ రాబడిలో తెలంగాణ ముందు నిలిచింది.

- 2019-20 వార్షిక బడ్జెట్లో వాణిజ్య పన్నులు, జీఎస్టీ ద్వారా రూ.47 వేల కోట్లు రాబడి వస్తుందని అంచనా వేశారు. అయితే ఆ అంచనాలను దాటే అవకాశాలు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. బడ్జెట్ అంచనాల్లో ఇప్పటికే రూ.40,268 కోట్లు వసూలు కాగా ఇది బడ్జెట్ అంచనా లక్ష్యంలో 86 శాతంగా ఉంది. భారీ వసూళ్లతో 6.35 శాతం వృద్ధి రేటు నమోదైంది.

- 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.45,379 కోట్ల రాబడి వచ్చి మొత్తం 15.37% వృద్ధిరేటు నమోదైంది.

ప్రస్తుతం ఆర్థిక మాంద్యం వలన ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఆదాయం అంతగా రాదని భావించారు. కానీ అంచనాలకు మించి కలెక్షన్లు వస్తుండడంతో ఆదాయం భారీగా వస్తోంది. స్తాయని అంచనా. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి రూ.48 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్ల రాబడిపై ఆశలు పెట్టుకున్నారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా నెల రోజుల సమయం ఉంది. ఈ సమయంలో బకాయిలతో పాటు పన్నుల రూపంలో రూ.8,000 కోట్ల నుంచి రూ.10,000 కోట్ల వరకు వసూలు అవుతాయని అధికార వర్గాలు ఆశిస్తున్నాయి. దీంతో ఆ మేరకు వచ్చే అవకాశం ఉంది. ఆదాయం భారీగానే ఉండడంతో ప్రభుత్వ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Tags:    

Similar News