ఇప్పుడు దేశంలో ధరలకు పట్టపగ్గాల్లేకుండా పెరిగిపోతున్నాయి. సామాన్యులకు గుదిబండగా మారాయి. ఆకాశాన్నంటిన పెట్రోల్ ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగేందుకు ఓ రాష్ట్ర సీఎం సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఈ ప్రకటన దేశవ్యాప్తంగా సంచలనమైంది.
లీటర్ పెట్రోల్ పై రూ.25 తగ్గిస్తున్నట్లు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరన్ ప్రకటించారు. కాకపోతే ఈ అవకాశం కేవలం ద్విచక్రవాహనదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జేఎంఎం ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
'పెట్రోల్, డీజిల్ ధరలు నానాటికీ పెరిగిపోతుండడంతో పేదలు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల రాష్ట్రస్థాయిలో ద్విచక్ర వాహనాలకు లీటర్ పెట్రోల్ పై రూ.25 మేర తగ్గించి కల్పిస్తున్నాం. ఈ ప్రయోజనం జనవరి 26 నుంచి అమలులోకి రానుంది' అని వెల్లడించారు.
ఈ సందర్భంగా టూరిజం పాలసీ బుక్ లెట్ ను విడుదల చేయడంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పోషకాహార లోపం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషి చేస్తామని సీఎం తెలిపారు.
విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకం వారికి స్టూడెంట్ క్రెడిట్ కార్డులను ఇవ్వనున్నట్లు తెలిపారు. గిరిజన వర్గాలకు చెందిన పిల్లలకు బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.