విషయాన్ని సూటిగా ప్రస్తావించకుండా.. నంగి మాటలు మాట్లాడుతూ.. లేని ఆదర్శాల్ని చెబుతూ.. చేతల్లో లేని నీతుల్ని మాటల్లో చెప్పే అద్భుత టాలెంట్ వైసీపీ బ్యాచ్ సొంతమన్న మాట బలంగా వినిపిస్తోంది. విషయం ఏదైనా సరే తమకు అనుకూలంగా వాదనను నిర్మించటం ఎలా అనే అద్భుతమైన కళలో పీహెచ్ డీ చేసిన వారిని జాగ్రత్తగా ఎంపిక చేసుకొని. సోషల్ మీడియాతో ఆట ఆడుకునే కొత్త తరహా పొలిటికల్ గేమ్ ఈ మధ్యన ఏపీలో ఎక్కువగా కనిపిస్తోంది.
చివరకు బాధితులు సైతం.. తామే తప్పుగా వ్యవహరిస్తున్నామేమో? అన్న సందేహానికి గురయ్యేలా ఉండే వారి తీరుతో నిజాలు అబద్ధాలుగా.. అసత్యాలు నిప్పులాంటి నిజాలుగా మారిపోతున్న దుస్థితి. మిగిలిన విషయాల్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను క్లోజ్ గా ఫాలో అవుతూ.. ఆయనకు అపాయాన్ని కలిగించే రీతిలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వాహనాన్ని.. వ్యక్తుల గురించి జనసేన పార్టీ ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ ప్రస్తావించటం.. దానికి సంబంధించిన ప్రెస్ నోట్ రిలీజ్ చేయటం జరిగింది.
కట్ చేస్తే.. రెక్కీ లాంటిదేమీ లేదని.. అందంతా సానుభూతి కోసం పవన్ కల్యాణ్ అండ్ కో చేస్తున్న నాటకం అంటూ కొత్త తరహా ప్రచారానికి తెర తీశారు. ఇక్కడ విషయం ఏమంటే.. రెండు వేర్వేరు అంశాల్ని కలగాపులగం చేస్తూ..తమ టాలెంట్ తో అసలు విషయాన్ని పక్కన పెట్టి.. కలర్ ఫుల్ కిచడీగా చేసిన తీరును చూస్తే.. వావ్.. వాటే టాలెంట్ అని మురిసిపోకుండా ఉండలేం. కానీ.. ఇదంతా జనాలకు పనికొచ్చే విషయాల మీద చేస్తే.. ఇలాంటి తీరును ప్రశంసించొచ్చు. కానీ.. ఈ తెలివితేటలన్ని చచ్చు విషయాలకు.. సత్యాన్ని నాశనం చేసేందుకు వాడటంతోనే అభ్యంతరమంతా.
పవన్ కల్యాణ్ మీద రెక్కీ జరిగిందన్న సందేహాన్ని మాత్రమే జనసేన చెప్పిందే తప్పించి.. నీలి బ్యాచ్ మాదిరి తీర్పు ఇవ్వలేదు. తమకు కలిగిన సందేహాన్ని జనాలకు చెబుతూ.. విచారణ సంస్థలు కూడా ఆ విషయం మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ రెక్కీ మాటలోని వాస్తవాన్ని గుర్తించిన నీలి బ్యాచ్ తత్తరపాటుకు గురై.. దీని గురించి చర్చ ప్రజల్లో పెరిగితే.. తమకు జరిగే నష్టాన్ని అంచనా వేసిన వారు.. కొత్త తరహా వాదనకు వెతుకలాటను మొదలు పెట్టారు.
అలాంటి వేళలోనే.. పవన్ కల్యాణ్ ఇంటి వద్ద అర్థరాత్రి సమయంలో మందుబాబులు రావటం.. అనుమానాస్పదంగా కనిపించటంతో పాటు.. వారి తీరు అభ్యంతరకరంగా ఉండటంతో వారి గురించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు.దీంతో.. వారు వచ్చి మందుబాబులను స్టేషన్ కు తరలించారు. అంతే.. ఈ రెండు వేర్వేరు సంఘటల్ని ఒకటిగా మార్చేసి.. రెక్కీ విషయాన్ని పలుచన చేయటానికి తమ మేధాశక్తికి పదనును పెట్టి దరిద్రపుగొట్టు వాదన ఒకటి తెర మీదకు తీసుకొచ్చారు.
మందుబాబులకు.. పవన్ పై రెక్కీ చేసిన వారికి లింకు లేకున్నా.. ఆ రెండింటిని కలగేసి.. మందుబాబులు రెక్కీ చేశారా? అంటూ విషయాన్ని సింఫుల్ గా మార్చేశారు. తాము చేసే తప్పుడు ప్రచారానికి జూబ్లీహిల్స్ పోలీసుల వాదనను జత చేశారు. అసలు రెక్కీనే జరగలేదని.. ఆ మాటలతో సానుభూతి కొట్టేయాలంటూ తప్పుడు రాజకీయాలు చేస్తున్నారంటూ తమ అద్దె మైకుల మూకను రంగంలోకి దించారు.
విచిత్రమైన విషయం ఏమంటే.. ఇలాంటి విషయాల మీద వెనుకాముందు చూసుకోకుండా తీర్పులు ఇచ్చేసే ఈ బ్యాచ్.. తమకు చెప్పిందే నిజమనుకొని తప్పుడు వార్తల వంటకాన్ని వండేసి.. వాటిని ప్రజలకు వడ్డించేయటంతో కొత్త అనుమానాలు.. సందేహాలు ఎదురయ్యే పరిస్థితి. మొత్తంగా మందుబాబుల రచ్చను రెక్కీతో ముడిపెట్టి.. విషయ తీవ్రతను పక్కదారి పట్టించే దరిద్రపుగొట్టు టాలెంట్ ను తరచి చూస్తే మాత్రమే కనిపిస్తుంది. లేదంటే.. చిలకపలుకుల్లా కనిపించే వాటిల్లో ఉండే దుర్మార్గ ప్లాన్ ను ప్రజలు జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.