సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ ఉదంతంలో ఏవీ సుబ్బారెడ్డి రిలీజ్

Update: 2021-01-07 10:24 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువులను కిడ్నాప్ చేసిన ఉదంతంలో మరో ఆసక్తికర అప్డేట్ చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా (ఏ1) పేర్కొన్న ఏవీ సుబ్బారెడ్డిని పోలీసులు విడిచి పెట్టారు. బుధవారం సాయంత్రం వేళలో మాదాపూర్ కు సమీపంలోని అయ్యప్ప సొసైటీ వద్ద ఏవీ సుబ్బారెడ్డి ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

తనకు.. కిడ్నాప్ ఉదంతానికి సంబంధం లేదని..తనకు భూమా అఖిలప్రియకు పడటం లేదన్న ఆయన.. తనను అనవసరంగా ఇరికిస్తున్నారన్నారు. ఈ వివాదం గురించి ఆయన మాట్లాడుతున్న వేళ.. హైదరాబాద్ పోలీసులు మీడియా సమావేశానికి వచ్చి.. ఆయన్ను అదుపులోకి తీసుకెళ్లారు. తనను ఎందుకు అదుపులోకి తీసుకెళుతున్నారంటూ ఆయన ప్రశ్నించారు. ఎక్కడకు తీసుకెళుతున్నారని చెప్పగా.. సమాధానం చెప్పలేదు. ఈ సందర్భంగా ఆయన అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారిని పక్కకు నెట్టేసి తమ వెంట తీసుకెళ్లారు.

అనంతరం పోలీసులు జరిపిన విచారణలో తాజా కిడ్నాప్ ఉదంతానికి.. ఏవీ సుబ్బారెడ్డికి ఏ మాత్రం సంబంధం లేదన్న విషయాన్ని ప్రాథమికంగా గుర్తించారు. దీంతో ఆయన్ను విడుదల చేశారు. అయితే.. 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చిన పోలీసులు.. విచారణకు ఎప్పుడు పిలిస్తే.. అప్పుడుహాజరుకావాలని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె తాజాగా ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కిడ్నాప్ కేసులో తన తండ్రికి ఏ మాత్రం సంబంధం లేదని గుర్తించిన పోలీసులు విడిచిపెట్టారని.. అందుకు థ్యాంక్స్ చెప్పారు. మరోవైపు.. ఈ కేసులో ఇప్పుడు ఏ2గా ఉన్న భూమా అఖిలప్రియ.. ఏ3గా ఉన్న ఆమె భర్త భార్గవ్ రామ్ చుట్టూనే కిడ్నాప్ కేసు తిరుగుతూ ఉంది.
Tags:    

Similar News