జియో ఆఫ‌ర్ బంద్‌.సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన మ‌రో సంస్థ‌

Update: 2017-03-31 17:49 GMT
ఆల్ ఫ్రీ నినాదంతో ఉచిత ఆఫర్లతో టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో త‌న సేవ‌ల‌కు ఫుల్ స్టాప్ పెట్టింది. మార్చి 31తో ఆ ఉచిత ఆఫ‌ర్లు ముగిశాయి.  ఏప్రిల్ 1 నుంచి జియో టారిఫ్ ప్లాన్స్ లోకి ఎంట్రీ ఇస్తోంది. మరోవైపు అనేక స్వదేశీ, విదేశీ టెలికాం ఆపరేటర్లు తమ ప్లాన్లు సమీక్షించుకుంటున్నాయి. ఈ క్రమంలో దేశీయ టెలికం బిజినెస్ పై కెనడియన్ మొబైల్ తయారీ సంస్థ డాటా విండ్ కన్నేసింది. 3జీ, 4జీ సేవలను అందించే దిశగా  వ్యాపారాన్ని ప్రారంభించనుంది. సంవత్సరం మొత్తానికి రూ.200 చెల్లిస్తే చాలు.. డేటాను ఫుల్లుగా వాడేసుకునే విధంగా సరికొత్త ప్లాన్ ను ఆలోచిస్తోంది.

దేశంలో బడ్జెట్‌ ఫోన్లు, తక్కువ ధరలకే ల్యాప్‌టాప్‌ లను అందిస్తున్న డేటా విండ్‌..భారత టెలికాం వ్యాపారంలోకి రూ.100 కోట్ల పెట్టుబడులతో ఎంట్రీ ఇస్తోంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా వర్చ్యువల్‌ నెట్‌వర్క్‌ ఆపరేటరింగ్‌ కోసం దరఖాస్తు చేసింది. దీనికి అనుమతి లభించిన వెంటనే.. ఏడాదికి రూ.200తోనే డేటా సర్వీసులను అందించనుంది. ప్రధానంగా డేటా సేవలపై దృష్టి పెట్టినట్టు సీఈవో సింగ్‌తులి చెప్పారు. నెలకు రూ.20 లేదా అంతకంటే తక్కువ డేటా ప్లాన్లు అందుబాటులోకి తీసుకు రానున్నట్టు తెలిపారు. జియో రూ.300 ప్లాన్‌ చూస్తే.. వెయ్యి నుంచి రూ.1,500 ఖర్చు చేయగలిగిన మధ్య తరగతి వారికి మాత్రమే అందుబాటులో ఉంది. 30కోట్ల మంది మాత్రమే ఈ పరిధిలోకి వస్తారని.. మిగతావారంతా నెలకు రూ.90 ఖర్చు చేయటమే కష్టమని విశ్లేషించారు. పేదలు, సామాన్యులను దృష్టిలో పెట్టుకుని.. నెలకు రూ.20, 30 రూపాయల డేటా ప్లాన్ ను అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. నెలకి రూ.20 లేదా సంవత్సరానికి రూ.200 మించకుండా ప్లాన్లను ప్రిపేర్ చేస్తున్నట్లు ప్రకటించారు. త‌ద్వారా జియో వంటి ఉచిత ఆఫ‌ర్ కాక‌పోయినా అదే స్థాయిలో చ‌వ‌క సేవ‌లు అందించే ఆఫ‌ర్ ప్ర‌వేశ‌పెట్టిన‌ట్ల‌యింది.

మ‌రోవైపు ప్ర‌భుత్వ రంగం బీఎస్‌ఎన్ఎల్ తన బ్రాండ్‌బ్యాండ్ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ‘అన్‌లిమిటెడ్ బ్రాడ్‌బ్యాండ్@249’ పేరుతో నెలరోజుల పాటు రోజుకి 10జీబీ డాటాను అందిస్తున్నట్లు ప్రకటించింది. అంటే నెలకి రూ. 249 చెల్లిస్తే రోజుకి డౌన్‌లోడ్, బ్రౌజింగ్ కోసం 10జీబీ డాటాను వాడుకోవచ్చు. కొత్త బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ పొందడానికి టోల్ ఫ్రీ నంబర్ 1800 345 1500ని సంప్రదించాలి. దీంతో పాటు మరిన్ని ఆఫర్లు కూడా ఇచ్చింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల మధ్య ఏ నెట్‌వర్క్‌కి అయినా అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవ‌చ్చు. ఆదివారం రోజు మొత్తం అన్ లిమిటెడ్ కాల్స్ ఫ్రీ ఇస్తున్నారు. మొత్తంగా డాటా అంటే ఒక‌నాటి అంత‌టి ఖ‌రీదు కాద‌నేది టెల్కోల వార్ పుణ్యమా అని తెలిసిపోయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News