రాజ్యాంగాన్ని సంబంధిత స్ఫూర్తిని అర్థం చేసుకుంటే అంబేద్కర్ అందరివాడు. ఆయన్ను వేరు చేసి చూస్తే కులాల పరంగా వర్గీకరణల పరంగా చూస్తే ఆయన అర్థం కారు కాలేరు కూడా ! కనుక కోనసీమ వాసులారా ! శాంతించండి. స్వార్థ రాజకీయాలకు బలి కావొద్దు. మనుషులంటేనే మంచోళ్లు అనే మాటకు దగ్గరగా మీరు ఉండండి చాలు.
ఏం వద్దు. ఓ సాగునీటి ప్రాజెక్టు లేదని రోడ్డెక్కారా ఎప్పుడయినా.. పోనీ పోలవరం ముంపు బాధితులకు అండగా ఏ రోజయినా రిలే నిరాహార దీక్షలు చేశారా.. అవన్నీ ఎందుకు అంబేద్కర్ ఆశయ సాధనకు ఏ నాయకులు ఇక్కడ కృషి చేశారని? వాటి గురించి ఎప్పుడయినా నిలదీశారా ? పండగ వస్తే వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి పేకాడి వెళ్తారే వారిని ఏ రోజు అయినా అడ్డుకున్నారా ? ఇవి కూడా ఆలోచించండి .
గుర్తు పెట్టుకోండి ఏం కాదు మీరంతా మనుషులు. ఆ మాటకు వస్తే నాయకుల కాలర్ పట్టుకుని మాట్లాడడం నేర్చుకోండి ఏం కాదు. విభజన చట్టం ప్రకారం మనకు రావాల్సిన వాటిపై ఏ ఒక్కరూ మాట్లాడడం లేదే అని వైసీపీ నాయకులతో మాట్లాడండి.. మీ ఆవేదన చెప్పండి.. బాగుంటుంది.. ఏం కాదు. అలాంటి ఆవేశం అవసరం కూడా ! అంతేకానీ కేవలం ఒక్క పేరు కోసం ఇంత డ్రామా మాత్రం నడపడం వేస్టంటే వేస్టు. వద్దు గాక వద్దు.
గోదావరి జిల్లాలకు చెందిన ప్రజలంటే మంచి వాళ్లు.. కోనసీమ ప్రజలంటే ఇంకాస్త మర్యాదస్తులు. మంచివాళ్లు. ఇవి కదా నిన్నటి వరకూ ఉన్న పేరు. దీనిని చెడగొట్టుకోవద్దు. స్వార్థ రాజకీయాల వలలో చిక్కుకోవద్దు. మీరు మీ జీవితాలను బలి తీసుకోవద్దు.
మహనీయుడు పేరు తోనే మీ జీవితాలు కానీ మా జీవితాలు కానీ మారిపోవు. ఇప్పటికీ గుక్కెడు నీరు అందని గోదావరి పల్లెలు కుప్పలు ఉన్నాయి. ఆ బెస్తవాడల కష్టాలను తీర్చేందుకు కృషి చేయండి..ఫైట్ చేయండి. మీ వెనుక దేవుడు తప్పక ఉంటాడు.
దేవుడు నడిచిన నేల అంటారు కదా ! కోనసీమను మరి ! ఆ దేవుడు ఇలాంటివి ఆదేశిస్తున్నాడా లేదు కదా! కాస్త శాంతించండి. ఏం కాదు. రాజకీయం రంగు తేలిపోయినాక ఎ వ్వరు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. వాన వెలిశాక రంగు తెలిశాక అన్నీ అన్నీ అర్థం అవుతాయి. అందాక సంయమనం పాటిస్తూ ఉండడమే ప్రథమ కర్తవ్యం. అదే తక్షణ అవసరం కూడా !