తెలుగుదేశం హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చోటు చేసుకున్న అవినీతి - అక్రమాలపై పూర్తి వివరాలతో ఫైల్ సిద్ధం అయినట్టుగా తెలుస్తోంది. ఇటీవలే పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులతో కూలంకషంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. పోలవరం పై పూర్తి వివరాలు తనకు ఇవ్వాలని - గత ఐదేళ్లలో చోటు చేసుకున్న చెల్లింపుల అక్రమాలపై నివేదికను ఇవ్వాలని జగన్ వారిని ఆదేశించారు. ఆ మేరకు ఇప్పుడు పూర్తి వివరాలతో ఫైల్ సిద్ధం అయినట్టుగా తెలుస్తోంది.
అందులో కొన్ని సంచలన విషయాలే వెల్లడి అయినట్టుగా సమాచారం. కొన్ని వేల కోట్ల రూపాయల అక్రమాలు పోలవరం ప్రాజెక్టులో చోటు చేసుకున్నట్టుగా నివేదికలో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది.
సూఛాయగా కొన్ని వివరాలు తెలుస్తూ ఉంది. పోలవరం ప్రాజెక్టులో భాగంగా జల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి పనులు ఏవీ ప్రారంభించకపోయినా ఏకంగా నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయల చెల్లింపులు
జరిగినట్టుగా ఆ నివేదికలో ప్రస్తావించారట. కనీసం జల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఒక్క రూపాయి విలువైన పనులు మొదలుపెట్టకపోయినా కాంట్రాక్టర్లకు ఏకంగా నాలుగు వందల కోట్ల రూపాయల చెల్లింపులు జరిగినట్టుగా సమాచారం. వివిధ రూపాల్లో అలా అయాచిత లబ్ధి కలిగించారట.
ఇలాంటి అంశాలతో పాటు కాంట్రాక్టర్లకు ఇంకా రకరకాల రూపాల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అయాచితంగా కలిగిన లబ్ధిని అంతా క్రోడీకరించిన నివేదికను జగన్ మోహన్ రెడ్డికి మంగళవారం సమర్పించనున్నారట అధికారులు.