అమెరికా అధ్యక్ష పగ్గాలు వచ్చే నెలలో స్వీకరించనున్న డొనాల్డ్ ట్రంప్ పై ఆరంభంలోనే సొంత పార్టీ నేతలు పెదవి విరుస్తున్నారు. అమెరికా విదేశాంగ మంత్రిగా ఎక్సాన్ మొబైల్ కార్పొరేషన్ అధినేత రెక్స్ టిల్లర్సన్ ను ఎంపిక చేసిన నేపథ్యంలో సెనేట్ లో పోరు తప్పనిసరిలా కనిపిస్తోంది. ఈ ఎంపికను కొంతమంది రిపబ్లికన్ నేతలు సమర్ధించినప్పటికీ రష్యాతో టిల్లర్సన్ కు గల సంబంధాలపై సెనేట్లో ఘర్షణ తప్పదని అంటున్నారు. మాస్కోతో ఆయనకు గల సంబంధాలపై, రష్యాపై అమెరికా ఆంక్షలను ఆయన వ్యతిరేకించడాన్ని కొంతమంది సెనేట్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్లాదిమిర్ పుతిన్తో టిల్లర్సన్‌కు గల సన్నిహిత సంబంధాలు విదేశాంగ విభాగంలో అనివార్యమైన ఘర్షణలు తలెత్తేలా చేస్తాయేమోనని విదేశాంగ వ్యవహారాలపై ప్రతినిధుల సభ కమిటీ సభ్యుడు ఎలియట్ ఎంగెల్ వ్యాఖ్యానించారు.
అయితే మాజీ విదేశాంగ మంత్రులు జేమ్స్ బెకర్, కండోలిజా రైస్, మాజీ రక్షణ మంత్రి రాబర్ట్ గేట్స్ వంటి అనేకమంది రిపబ్లికన్ నేతలు టిల్లర్సన్ ను బలపరుస్తున్నారు. ఎక్సాన్ మొబైల్ కార్పొరేషన్ లో గతంలో కండోలిజా రైస్, గేట్స్ కన్సల్టెంట్లుగా పనిచేశారు. దాంతో వారిరువురు కూడా ఎక్సాన్స్ ను బలపరిచారు. సెనేట్లో రిపబ్లికన్లకు స్వల్పంగా మెజారిటీ వున్నందున వీరి ఆమోదం టిల్లర్సన్ కు చాలా అవసరం. అయితే ముగ్గురు మద్దతు వున్నందువల్ల టిల్లర్సన్స్ ను కొంత బలం చేకూరుతుందని రిపబ్లికన్ సెనేటర్ జెఫ్ ఫ్లేక్ వ్యాఖ్యానించారు. టిల్లర్సన్‌ను తన కేబినెట్లో మరో మంత్రిగా ఎంపిక చేయడం వల్ల మాస్కో పట్ల కాస్తంత మెతక వైఖరి ప్రదర్శించే బృందంలో ఆయన కూడా చేరారు.
క్రిమియాను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో 2014లో రష్యాపై అమెరికా ఆంక్షలు విధించింది. ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సైబర్ దాడులకు పాల్పడిందని కూడా రష్యాపై ఆరోపణలు వచ్చాయి. జనవరి ప్రారంభంలో జరిగే సమావేశాల్లో విదేశాంగ నిపుణులైన రిపబ్లికన్ నేతలు జాన్ మెక్ కెయిన్, లిండ్సే గ్రాహమ్ వంటి వారు టిల్లర్సన్ ను తీవ్రంగా ఎదుర్కొనే అవకాశం ఉందని అంటున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో టిల్లర్సన్‌కు మంచి సన్నిహత సంబంధాలు ఉండేవన్న అంశం అందరికీ తెలిసిందేనని మెక్ కెయిన్ అన్నారు. సెనేట్లో రిపబ్లికన్లకు చాలా స్వల్ప మెజారిటీ 52-48 వుంది, ప్రతి ఒక్క డెమోక్రాట్ ఆయన్ని వ్యతిరేకిస్తూ, మరి కొంతమంది ఫిరాయించినట్లైతే టిల్లర్సన్ ను నిరోధించగలుగుతారు. ఇదిలాఉండగా ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ల ప్రయోజనాలను బలంగా సమర్ధించగలిగే వ్యక్తి టిల్లర్సన్ అని ట్రంప్ కొనియాడారు. 2006 నుండి ఎక్సాన్ మొబైల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హోదాలో ఉన్న టిల్లర్సన్ ట్రంప్ మాదిరిగానే ఎన్నడూ ప్రభుత్వ పదవులు నిర్వహించలేదు. తన కంపెనీ కోసం విదేశాలతో ఒప్పందాలు చేసుకోవడంలో సిద్ధహస్తుడైన టిల్లర్సన్ కు ఆ రకంగా విదేశీ అనుభవం ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/