వర్ధమాన హీరోయిన్ రేష్మ రాజకీయ అరంగేట్రానికి రంగం సిద్ధం చేసుకుంది. తెలుగులో ‘ఈరోజుల్లో’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రేష్మీ సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో రాజకీయాల వైపు అడుగులు వేసింది. తాజాగా బీజేపీ టికెట్ పొంది.. ఖమ్మం జిల్లా వైరా నుంచి శాసనసభకు పోటీచేస్తోంది.
రేష్మా టాలీవుడ్ లో ‘బాడీ గార్డ్’ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో కనిపించింది. ఆ తర్వాత ‘ఈరోజుల్లో’ మూవీలో హీరోయిన్ గా తొలిసారి నటించింది. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం హిట్ కావడంతో ఆమెకు తమిళ, మళయాలం నుంచి కూడా ఆమెకు అవకాశాలొచ్చాయి. ఆ తర్వాత తెలుగులో జై శ్రీరామ్ మూవీలో కూడా నటించింది. ఆ సినిమా సరిగా ఆడలేదు. ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో సినిమాలకు దూరమైంది..
రేష్మా తల్లి హైకోర్టులో లాయర్ గా పనిచేస్తుండగా.. తండ్రి సింగరేణి కాలరీస్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో రేష్మా బీజేపీ వైపు అడుగులు వేసింది. కొంతకాలంగా బీజేపీలో క్రియాశీలంగా ఉంటూ ఖమ్మం జిల్లాలో పనిచేసుకుంటూ పోతోంది. తాజాగా బీజేపీ ఆమెకు వైరా అసెంబ్లీ టికెట్ ను కేటాయించింది. టికెట్ రావడంతో రేష్మా వైరాలో ప్రచారాన్ని ప్రారంభించింది. మరి రేష్మా వైరాలో గెలుస్తుందా.? ఆమె భవిష్యత్ ఎలా ఉండబోతుందో చూడాలి మరి..