రిటైన్ లాభమా? నష్టమా? అయితే ఎవరికెంత.. ? దిగ్గజాలకు తగ్గిందెంత?

Update: 2022-02-15 11:36 GMT
పరుగుల్లో కానీ.. వికెట్లలో కానీ.. డబ్బులో కానీ.. ఐపీఎల్ అంటేనే ‘కోట్లా’ట. అందుకే ఆ లీగ్ అత్యంత ధనవంతమైనదిగా పేరు తెచ్చుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో లీగ్ లు జరుగుతున్నా.. ఆఖరికి ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్ కూడా ఐపీఎల్ కు సాటి రావు. దీనికితగ్గట్లే కోట్లాది అభిమానులు.. అంతకుమించిన వీక్షుకులతో భారత లీగ్ లో ఆకర్షణ ఉంటుంది. తాజాగా ఐపీఎల్‌ మెగా టోర్నీకి

సంబంధించిన వేలం పాట పూర్తయింది. పది ఫ్రాంఛైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి. వేలంలో పలువురు ఆటగాళ్లు అనూహ్య ధరకు అమ్ముడుపోయి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేయగా.. పలువురు స్టార్‌ ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు ఏ జట్టూ ఆసక్తి చూపకపోవడం గమనార్హం. ఇంకొంత మంది గతేడాది కంటే తక్కువ ధరకు కూడా ఇతర జట్లకు తరలిపోయారు. ఇక రిటెన్షన్‌ చేసుకున్న ఆటగాళ్లలో ఎవరెవరికి ఎంతెంత దక్కింది.. గత ఏడాదితో పోల్చితే.. పెరిగిందా..? అనేది చూస్తే.. డింఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ధోనీ (కెప్టెన్‌), రవీంద్ర జడేజా, రుతురాజ్‌ గైక్వాడ్‌, మొయిన్‌ అలీలను తిరిగి తీసుకుంది. వీరిలో ధోని గతేడాది ధర

రూ.15 కోట్లయితే ఈసారి రూ.12 కోట్లే ఇచ్చింది. అంటే రూ.3 కోట్లు తగ్గింది. ఇతడి కంటే చెన్సై పేసర్ దీపక్ చహర్ పై రూ.2 కోట్లు అధికంగా ఖర్చు పెట్టి వేలంలో కొనుక్కుంది. అది వేరే విషయం. ఇక జడేజా కు నిరుటి ధర రూ.7 కోట్లు, ఇప్పుడు రూ.16 కోట్లు. రూ. 9 కోట్లు ఎక్కువ. ఇటీవలి కాలంలో జడ్డూ ఫామ్ అత్యద్భుతంగా ఉండడమే దీనికి కారణం. మహారాష్ట్ర బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ కు నిరుటి ధర రూ.20 లక్షలే. కానీ, గతేడాది అతడు భారీగా పరుగులు చేశాడు. దీంతో ఈసారి 5.8 కోట్లు ఇచ్చి సీఎస్కే రిటైన్ చేసుకుంది. ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీకి రూ.7 కోట్లు ఇదివరకటి ధర కాగా.. ఇప్పడు రూ.8 కోట్లిచ్చారు.

ముంబయి ఇండియన్స్‌ రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), జస్ప్రిత్‌ బుమ్రా, సూర్యకుమార్‌ యాదవ్‌, కీరణ్‌ పొలార్డ్‌లను కొనసాగించింది. వీరిలో రోహిత్ కు రూ.15 కోట్లు గత ధర కాగా.. రూ.16 కోట్లు ఈసారి ఇచ్చింది. ఇతడి కంటే పేసర్ జస్ప్రీత్ బుమ్రా (రూ.7 కోట్ల నుంచి రూ.12 కోట్లు) బాగా లాభపడ్డాడు. సూర్య కుమార్ యాదవ్ (3.2 కోట్ల నుంచి రూ.8 కోట్లు) బాగానే లాభపడ్డాడు. పొలార్డ (రూ.5.4 కోట్ల నుంచి రూ.6 కోట్లు) మాత్రం స్వల్పంగా డబ్బు మూటగట్టుకున్నాడు.

కోల్‌కతా నైట్‌ రైడర్స్ ఆండ్రీ రసెల్‌, వరుణ్‌ చక్రవర్తి, వెంకటేశ్‌ అయ్యర్‌, సునీల్‌ నరైన్‌లను అట్టిపెట్టుకుంది. రస్సెల్ కు రూ.7 కోట్లుండగా  రూ.12కోట్లతో కొనసాగించింది. వరుణ్ చక్రవర్తి (రూ.4 కోట్ల నుంచి రూ.8 కోట్లు), వెంకటేశ్ అయ్యర్ (రూ.20 లక్షల నుంచి రూ.8 కోట్ల) బాగా డబ్బు పొందారు. అయితే, సీనియర్ సునీల్ నరైన్ ధర రూ.8.5 కోట్ల నుంచి రూ.6 కోట్లకు పడిపోయింది.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్‌), అబ్దుల్‌ సమద్‌, ఉమ్రాన్‌ మాలిక్‌లను మాత్రమే కొనసాగించింది. విలియమ్సన్ కు రూ.3 కోట్ల ధర ఉండగా.. రూ.14 కోట్లు ఇచ్చింది. కశ్మీరీ హార్డ్ హిట్టర్ సమద్ రూ.20 లక్షల నుంచి రూ.4 కోట్లకు ఎగబాకాడు. 150 కిలోమీటర్ల వేగంతో బంతులేసే మాలిక్ ధర రూ.10 లక్షల నుంచి రూ.4 కోట్లకు పెరగడం విశేషం. ఇతడూ కశ్మీరీనే.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: విరాట్‌ కోహ్లీ, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మహ్మద్‌ సిరాజ్‌లను మళ్లీ తీసుకుంది. అసలు కెప్టెన్ ఎవరో తేలాల్సి ఉంది. కోహ్లి ధర రూ.17 కోట్ల నుంచి రూ.15 కోట్లకు తగ్గింది. మ్యాక్స్ వెల్ రూ.14.25 కోట్ల నుంచి రూ.11 కోట్లకు పరిమితం అయ్యాడు. సిరాజ్ మాత్రం రూ.2.6 కోట్ల నుంచి రూ.7కోట్లకు ఎగబాకాడు.

దిల్లీ క్యాపిటల్స్‌: రిషభ్‌ పంత్ (కెప్టెన్‌), అక్షర్‌ పటేల్‌, పృథ్వీ షా, అన్‌రిచ్‌ నోర్జ్‌ లను కొనసాగించింది. పంత్ ధర (రూ.8 కోట్ల నుంచి రూ.16 కోట్లు) రెట్టింపైంది. అక్షర్ రూ.5 కోట్ల నుంచి రూ. 9కోట్లకు, నోర్జ్ ధర రూ.90 లక్షల నుంచి రూ.6.5 కోట్లకు పెరిగింది. షా ధర రూ.1.2 కోట్ల నుంచి రూ.7.5 కోట్లకు పెరిగింది.

రాజస్థాన్‌ రాయల్స్‌: సంజూశాంసన్‌ (కెప్టెన్‌), జోస్‌ బట్లర్‌, యశస్వి జైశ్వాల్‌లను అట్టిపెట్టుకుంది. సంజూ ధర రూ.8 కోట్ల నుంచి 14 కోట్లకు, బట్లర్ రూ.4.4 కోట్ల నుంచి రూ.10 కోట్లకు, జైశ్వాల్ రూ.2.4 కోట్ల నుంచి రూ.4 కోట్లు పలికారు.పంజాబ్‌ కింగ్స్‌: మయాంక్‌ అగర్వాల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌. వీరిలో మయాంక్ రూ.కోటి నుంచి రూ.12 కోట్ల కు ఎగబాకాడు. అర్షదీప్ రూ.20 లక్షల నుంచి రూ.4 కోట్ల రేటుకు చేరాడు.

గుజరాత్‌ టైటాన్స్‌: హార్దిక్‌ పాండ్య (కెప్టెన్‌), రషీద్‌ ఖాన్‌, శుభ్‌మన్‌ గిల్ ను కొనసాగించింది. వీరిలో గిల్ కు గతంలో రూ1.8 కోట్లివ్వగా ఈసారి రూ.8 కోట్లు ఇచ్చారు. రూ.9 కోట్లు ఉన్న రషీద్ గత ధర రూ.15 కోట్లకు పెరిగింది.  పాండ్యా స్థా
యి రూ.11 కోట్ల నుంచి రూ.15 కోట్లకు చేరింది.

లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌: కేఎల్‌ రాహుల్‌, రవిబిష్ణోయ్‌, మార్కస్‌ స్టాయినిస్‌లను తిరిగి తీసుకుంది. రూ.11 కోట్లు ఉన్న రాహుల్ గత ధర రూ.16 కోట్లకు చేరింది. బిష్ణోయ్ రూ.2కోట్ల నుంచి రూ.4 కోట్లకు, స్టోయినిస్ ధర రూ.4.8 కోట్ల నుంచి రూ.9.2 కోట్లకు పెరగడం విశేషం.
Tags:    

Similar News