జ‌గ‌న్ కు బీజేపీ ఇచ్చిన రిట‌ర్న్ గిఫ్ట్లు ఇవే !

Update: 2022-07-21 06:38 GMT
ఏపీ సీఎం జ‌గ‌న్ కు ఒకే రోజు రెండు ఝ‌ల‌క్ లు కేంద్రం ఇచ్చింది. ఒక‌టి ప్ర‌ధాని గ‌రీబ్ కల్యాణ్ ఆవాస్ యోజ‌న కింద పేద‌ల‌కు బియ్యం పంపిణీ చేయ‌కుంటే రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు నిలుపుద‌ల చేస్తామ‌ని హెచ్చ‌రించింది. అదేవిధంగా కొత్త‌గా స‌వ‌రించిన రేష‌న్ కార్డుదారుల జాబితాను ఆమోదించేదే లేద‌ని తేల్చేసింది.

ఈ రెండూ నిన్న‌టి వేళే జ‌రిగేయి. వీటిపైనే ఇప్పుడు వైసీపీ స‌ర్కారును డైలమాలో ప‌డేశాయి. వాస్త‌వానికి పీఎంజీకేఏవై కింద ఆరో ద‌శ ఇప్పుడు అమ‌లు కావాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ఎనిమిది ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల బియ్యాన్ని  రాష్ట్రానికి కేంద్రం కేటాయించింది.

కానీ త‌మ కార్య‌క‌ర్త‌లు నిర‌స‌న‌లు చేస్తున్నా అవేవీ ప‌ట్టించుకోకుండా పేద‌ల‌కు పంచాల్సిన బియ్యాన్ని పంపిణీ చేయ‌కుండా  మీన‌మేషాలు లెక్కిస్తోంద‌ని కేంద్ర ప్ర‌జాపంపిణీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్ మండిప‌డ్డారు.

ఇప్ప‌టిదాకా గ‌డిచిన ఐదు విడ‌త‌ల‌కు సంబంధించి 23.75 ల‌క్ష‌ల మెట్రిక్  ట‌న్నుల ధాన్యాన్ని (స‌రిగ్గా చెప్పాలంటే 23,75,496 మెట్రిక్ ట‌న్నుల ధాన్యం)  కేంద్రం త‌ర‌ఫున రాష్ట్రానికి పంపామ‌ని వెల్ల‌డించారు.

లోక్ సభ‌లో విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్ర‌శ్న‌కు సమాధానమిస్తూ.. కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ పై విధంగా స్పందించ‌డంతో బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌కు అద‌న‌పు బ‌లం చేకూరింది.

ఎందుకంటే వీళ్లంతా గ‌డిచిన వారం రోజుల్లో 2,3 సార్లు వేర్వేరు చోట్ల పీఎంజీకేఏవై పై నిర‌స‌న‌లు చెబుతున్నారు. క‌లెక్ట‌రేట్ల ద‌గ్గ‌ర ఆందోళ‌న‌లు చేస్తున్నారు.మ‌రోవైపు ఇదే సంద‌ర్భంలో ఏపీలో రేష‌న్ బియ్యం అందించే ల‌బ్ధిదారుల  సంఖ్య పెంచాల‌ని కోరుతూ సీఎం జ‌గ‌న్ చేసిన ప్ర‌తిపాద‌న‌ను నిన్న‌టి వేళ తోసిపుచ్చింది.
Tags:    

Similar News