రాయలేని మాటల్ని అనేసి.. ‘రా’ పదాన్ని అదే పనిగా ప్రయోగిస్తూ.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఘాటు సవాలు విసిరారు తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి. ఇటీవల కాలంలో ఇంత ఘాటైన పదజాలంతో విరుచుకుపడిన ఉదంతం ఇదే కావొచ్చు. తన మీద తీవ్రమైన పదజాలంతో విమర్శలతో విరుచుకుపడి.. రాజీనామా చేస్తావా? అంటూ తొడ కొట్టిన మల్లారెడ్డికి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు సమాధానం ఎందుకు ఇవ్వలేదు. మంత్రి పదవికి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా సిద్ధమని ఆయన ఫైర్ కావటం తెలిసిందే.
నిజానికి ఇలాంటి సవాలే.. విపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ ను ఉద్దేశించి చేసిన పక్షంలో.. ఆ వెంటనే రియాక్టు అయి ఉండేవారు. రాజీనామా చేయాలన్న సవాలు విసరటం ఆలస్యం.. దాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చి.. తన రాజకీయ ప్రత్యర్థులకు షాకులు ఇవ్వటానికి అస్సలు వెనుకాడేవారు కాదు. కానీ.. రేవంత్ ఏమీ కేసీఆర్ మాదిరి కాదు కదా? అందుకే.. మంత్రి మల్లారెడ్డి నోటి నుంచి అన్నేసి మాటలు వచ్చాయంటున్నారు.
ఎడా పెడా రాజీనామా మాటల్ని మాట్లాడిన మంత్రిగారి పరిస్థితి నియోజకవర్గంలో అంత గొప్పగా ఏమీ లేదంటున్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో 70వేల ఓట్ల పైచిలుకు భారీ మెజార్టీతో గెలుపొందటం బాగానే ఉన్నా.. ఆర్నెల్ల వ్యవధిలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో.. తన అల్లుడికి పార్టీ టికెట్ ఇప్పించుకున్న మల్లారెడ్డి.. రేవంత్ మీద పోటీ చేసి ఓటమిపాలు కావటం తెలిసిందే. నిజంగానే మల్లారెడ్డికి తిరుగులేని అధిక్యత ఉండి ఉంటే.. తన అల్లుడ్ని గెలిపించుకునే విషయంలో వెనుకబడేవారు కాదు కదా?
ఇక.. రేవంత్ విషయానికి వస్తే.. ఎంపీ పదవికి.. పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయటం అంత తేలిక కాదు. ఎంపీ పదవి విషయంలో కాస్త ముందుకు అడుగు వేసినా.. పార్టీ పదవిని వదలుకోవటం అంత తేలికైన విషయం కాదు. ఆ విషయాన్ని గుర్తించిన మల్లారెడ్డి. .తాను ఎంతగా సవాలు విసిరినా.. రాజీనామా విషయంలో రేవంత్ అడుగు ముందుకు వేసే అవకాశం లేని విషయాన్ని గుర్తించే అలాంటి వ్యాఖ్యలు చేశారన్న మాట వినిపిస్తోంది. తన వరకు తాను తొడ కొట్టి సవాలు చేసిన తర్వాత.. స్పందించాల్సింది అవతలి వారిదే.
ఈ విషయం మీద మల్లారెడ్డికి ఉన్న అవగాహనతోనే ఆయనీ ఘాటు వ్యాఖ్యలు చేసి ఉంటారని చెబుతున్నారు. ఇక.. రేవంత్ విషయానికి వస్తే.. తానిప్పుడు సమయంలో మల్లారెడ్డి విసిరిన సవాలుకు స్పందించే కన్నా.. విషయాన్ని మరో కోణంలో తీసుకెళ్లాలే కానీ.. మళ్లీ ఎన్నికకు సిద్దమన్న మాట నోట్లో నుంచి రావటం ఖరీదైన అంశంగా మారుతుంది. అందుకే.. ప్రస్తుతానికి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యల సారాంశాన్ని తీసుకోకుండా.. ఆయన మాటల్లోని వివాదాస్పద అంశాన్ని తీసుకున్నట్లుగా కాంగ్రెస్ నేతల తీరు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పక తప్పదు.