వార్ ముదిరింది: రేవంత్ రెడ్డి హౌజ్ ఆరెస్టు

Update: 2019-10-21 05:20 GMT
మ‌ల్కాజ్ గిరి ఎంపీ - కాంగ్రెస్ వ‌ర్కింగ్ కమిటీ అధ్య‌క్షుడు అనుముల రేవంత్ రెడ్డిని తెలంగాణ పోలీసులు హౌజ్ ఆరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డిని హౌస్ ఆరెస్ట్‌ కు దారి తీసిని ప‌రిస్థితులు ఏంటంటే.. ఆయ‌న ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ ను ముట్ట‌డిస్తార‌నే భ‌యంతోనే ముందు జాగ్ర‌త్త‌గా ఆరెస్ట్ చేశార‌ట‌. ఆర్టీసీ స‌మ్మె నేటికి 17వ రోజుకు చేరుకుంది. అందులో భాగంగా తెలంగాణ ప్ర‌భుత్వ నిర‌కుంశ వైఖ‌రికి నిర‌స‌న‌గా కాంగ్రెస్ పార్టీ ప్ర‌గ‌తి భ‌వ‌న్ ముట్ట‌డి కార్య‌క్ర‌మానికి పిలుపునిచ్చింది. దీంతో ప్ర‌గ‌తి భ‌వ‌న్ ప‌రిస‌ర ప్రాంతాల్లో పోలీసులు 144సెక్ష‌న్ విధించారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ వద్ద పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ద్ద‌కు రాక‌పోక‌ల‌పై పూర్తి నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు బేగంపేట‌ - పంజాగుట్ట‌ - సోమాజీగూడ - ఖైర‌తాబాద్ ప్రాంతాల‌ను పోలీసులు దిగ్భంధించారు. ఒక ఏకంగా బేగంపేట మెట్రో స్టేష‌న్‌ ను పోలీసులు మూసేశారు. ఇక స‌మ్మెకు మ‌ద్ద‌తుగా నిలుస్తున్న నేత‌ల‌ను ఎక్క‌డిక‌క్క‌డే ఆరెస్టు చేస్తున్నారు. కాంగ్రెస్‌ - ప్రతిప‌క్ష నేత‌ల‌ను - ప్ర‌జాప్ర‌తినిధుల‌ను దొరికిన వారిని దొరికిన‌ట్లు అరెస్ట్ చేయ‌డం - లేకుంటే హౌజ్ ఆరెస్టు చేయ‌డం చేస్తున్నారు. మ‌ల్కాజ్ గిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి - కాంగ్రెస్ నేత‌లు ష‌బ్బీర్ అలీ - పొన్నం ప్ర‌భాక‌ర్‌ - విశ్వేశ్వ‌ర్‌ రెడ్డి ల‌ను హౌజ్ అరెస్టు చేశారు. ఎంపీ రేవంత్‌ రెడ్డి అరెస్టుతో కాంగ్రెస్ శ్రేణులు భ‌గ్గుమంటున్నాయి.

పోలీసులు రేవంత్ రెడ్డిని ఇంటి నుంచి బ‌య‌టికి రాకుండా ఇంట్లోనే నిర్భందించ‌డంతో చాలా చోట్ల ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. రేవంత్‌ రెడ్డికి మ‌ద్ద‌తుగా తెలంగాణ రాష్ట్రంలోని ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఆర్టీసీ కార్మికులకు మ‌ద్ద‌తుగా ధ‌ర్నాలు - రాస్తారోకోలు చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల స‌మ్మెకు కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో స‌మ్మె ఉధృత‌మైంది. హైకోర్టు చెప్పినా కూడా అటు ప్ర‌భుత్వం - ఇటు ఆర్టీసీ కార్మికులు స‌సేమిరా అంటున్నాయి. కార్మికులు ఓ మెట్టు దిగేందుకు - చ‌ర్చ‌ల‌కు వెళ్లేందుకు అనుకూలంగా ఉన్నా కూడా ప్ర‌భుత్వం మాత్రం చ‌ర్చ‌ల‌కు ముందుకు రావ‌డం లేదు.. దీంతో వ్య‌వ‌హారం మ‌రింత జ‌ఠిలంగా మారింది.



Tags:    

Similar News