ఎర్రటి ఎండలో రోడ్డు మీద నిలుచొని మరీ నిరసన

Update: 2017-03-13 16:01 GMT
తెలంగాణ అసెంబ్లీ బయట.. ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం ఓపక్క జరుగుతున్న వేళ.. తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి.. సండ్ర వెంకట వీరయ్యలు ఎర్రటి ఎండలో నిలబడి నిరసన తెలిపిన తీరు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలారని సభ నుంచి సస్పెండ్ అయిన వారిరువురు..రోడ్డు మీద మైనంగా నిలబడి నిరసన తెలిపారు.

ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన ఇరువురు.. తమను సభ నుంచి సస్పెండ్ చేసే అధికారం స్పీకర్ కు లేకున్నా.. అన్యాయంగా తమను సస్పెండ్ చేశారని.. తమ గొంతు నొక్కటానికే సస్పెన్షన్ చేశారన్నారు. బడ్జెట్ సమావేశాల్లో తమ గొంతు నొక్కటానికే కేసీఆర్ సర్కారు ఈతీరులో వ్యవహరించిందన్న రేవంత్.. ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంబేడ్కర్ విగ్రహాల ఎదుట నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఏ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకొని సభ నుంచి సస్పెండ్ అయ్యరో.. ఇప్పుడు అదే గవర్నర్ ను కలిసి.. ప్రభుత్వ తీరును ఆయన దృష్టికి తీసుకెళ్లటమే కాదు.. తమను సభ నుంచి సస్పెన్షన్ ఇష్యూను కూడా ప్రస్తావిస్తామని చెప్పటం గమనార్హం. ఏదైనా బాధను చెప్పుకోవాలంటే చప్పున గుర్తుకు వచ్చే గవర్నర్ మీద నిరసన తెలపటం ఎందుకు? ఇప్పుడు తమకేదో అన్యాయం జరిగిందంటూ ఆయన దగ్గరకే వెళ్లటం ఎందుకు..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News