ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఎనుముల రేవంత్ రెడ్డిని గురువారం కొడంగల్ పోలీసులు అరెస్టు చేశారు. కొడంగల్ లో ఓ మార్కెట్ యార్డు ప్రారంభోత్సవానికి మంత్రి జూపల్లి తో పాటు స్థానిక ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి హాజరుకావాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి రేవంత్ తన అనుచరులతో కలిసి వచ్చారు. రేవంత్ అనుచరులను పోలీసులు అడ్డుకోవడంతో పాటు లాఠీచార్జ్ చేశారు. దీంతో రేవంత్ అక్కడ ధర్నాకు దిగడంతో పోలీసులు రేవంత్ ను అరెస్టు చేశారు. రేవంత్ ను అరెస్టు చేయడంతో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు పోలీసుల వాహనాలపై రాళ్లు రువ్వారు. జీపు అద్దాలను కూడా ధ్వసం చేశారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.