ఓటుకు నోటు కేసులో అరెస్టై... బెయిలుపై బయటకొచ్చిన తెలంగాణ టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిలో మునుపటి వేడి ఏమాత్రం తగ్గలేదు. కేసీఆర్ చేతిలో తానేమీ ఓడిపోలేదని.. కేసీఆర్ ది అంతా దొంగాటని ఆయన వ్యాఖ్యానించారు. ఏబీఎన్ ఛానల్ లో నిర్వహించే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమానికి తన భార్య గీత సహా వచ్చిన రేవంత్ ఈ సందర్భంగా తన మనసు విప్పారు.
కేసీఆర్ ను తాను సైకో అని అనలేను కానీ కాస్త విపరీత మనస్తత్వం ఉన్నవారని మాత్రం రేవంత్ చెప్పుకొచ్చారు.. ఆ కుటుంబమంతా బ్లాక్ మెయిలర్లేనని.... బ్లాక్ మెయిలింగ్ కు వారు బ్రాండ్ అంబాసిడర్లని రేవంత్ అన్నారు. అంతేకాదు... కేసీఆర్, జగన్ లను కేవీపీ రామచంద్రరావు కలుపుతున్నారని రేవంత్ ఆరోపించారు.
కాగా రేవంత్ అరెస్టు సమయంలో తీవ్రమైన షాక్ కు గురయ్యానని... అయితే, ఇప్పుడు భయం పోయిందని.. ఇంతకంటే జరిగేదేమీ ఉండదన్న ధైర్యం వచ్చిందని రేవంత్ భార్య చెప్పుకొచ్చారు. రెండు నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కేసులో ఉన్న రేవంత్ రెడ్డితో కార్యక్రమం కావడంతో దీనిపై అందరిలోనూ ఆసక్తి ఉంది. త్వరలో ఇది ప్రసారం కానుంది.