మామూలుగానే మాటల మనిషి. అందులోకి దెబ్బ మీద దెబ్బ పడి.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్ అయి.. అయ్యగారి భాగోతమంతా వీడియో రూపంలో బయటకు వచ్చేసిన నేపథ్యంలో.. మీసం మెలేసీ.. తొడ కొట్టేసి.. నీ అంతు చూస్తానని చెప్పిన తెలంగాణ తెలుగుదేశం నేత రేవంత్ కు కోర్టు అడ్డంకి తీరిపోవటంతో.. హైదరాబాద్ కు ఎంట్రీ ఇచ్చారు.
ఓటుకు నోటు వ్యవహారంలో పరిమితులు విధించిన కోర్టు.. రేవంత్ నియోజకవర్గమైన కొండగల్ దాటి వెళ్లొద్దన్న ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఆ నిబంధనల్ని సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన 24 గంటల వ్యవధిలోనే హైదరాబాద్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వటం ద్వారా.. తన విమర్శల దాడి మొదలెట్టేశారు. దీనికి తోడు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చైనా పర్యటనలో ఉన్న నేపథ్యంలో.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రేవంత్ తన మాటకు పదును పెంచారు.
‘‘ఆట కాదు వేట మొదలైంది. మీ అంతు చూసేవరకు విశ్రమించేది లేదు’’ అంటూ భారీ డైలాగులతో క్యాడర్ లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. కేసీఆర్ అధికారపీఠాన్ని బద్ధలు కొట్టేందుకు సన్నద్ధమవుతున్నామని.. తమను ఎవరూ ఆపలేరంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. మంగళవారం కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యల్ని కాపీ కొట్టేసి రేవంత్.. తన మాటల్ని వినేందుకు వచ్చినోళ్లకు మసాలా మాటల్ని అందించారు.
‘‘ఎక్కడైనా ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు వెళితే ఆర్థిక మంత్రిని తీసుకెళతారు. కానీ.. కేసీఆర్ మాత్రం అల్లుడు ఔరంగజేబు వెన్నుపోటు పొడుస్తాడన్న భయంతో స్పీకర్.. శాసన మండలి ఛైర్మన్లను వెంటబెట్టుకొళ్లాడు’’ అని వ్యాఖ్యానించి.. కార్యకర్తలు.. నేతలు చప్పుట్లు కొట్టే మాటలు చెప్పారు. ఉరకలెత్తే ఉత్సాహం ఉన్నప్పుడు మాటలు కోటలు దాటుతాయన్న చందంగా రేవంత్ తాజా వ్యాఖ్యలు ఉన్నాయి. తాను హైదరాబాద్ వస్తున్నానని తెలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చైనాకు పారిపోయాడంటూ బీరాలు పలికేశారు.
‘‘అప్పట్లో బెయిల్ వచ్చి రేవంత్ జైలు నుంచి విడుదలవుతున్నారని తెలియగానే కేసీఆర్ కు జ్వరం వచ్చింది. ఇప్పుడు కొడంగల్ దాటి రేవంత్ రెడి రాజధానికి వస్తున్నారని తెలుసుకొని కేసీఆర్ చైనాకు వెళ్లిపోయారు. సింహం సింగిల్ గా వస్తే పిల్లులు పారిపోయాయి’’ అంటూ కోటలు దాటే మాటలు చెప్పారు. కామెడీ ఏమిటంటే.. కేసీఆర్ చైనా పర్యటనకు వెళ్లింది సోమవారం. రేవంత్ కు బెయిల్ సడలింపులు ఇచ్చింది మంగళవారం. అయినా.. రేవంత్ హైదరాబాద్ వస్తున్నారన్న వెంటనే చైనా పారిపోవటానికి కేసీఆర్ ఏమైనా పిల్లాడా? విమర్శలు చేయటంలో తప్పు లేదు కానీ.. దానికి ఒక పద్ధతి పాడు ఉండాలి. కోటలు దాటే మాటలకు కార్యకర్తలు. తమ్ముళ్లు కేరింతలు కొట్టొచ్చేమో కానీ.. ప్రజలు పెద్దగా పట్టించుకోరని.. అతిగా ఫీలవుతారన్న విషయాన్ని రేవంత్ పరిగణలోకి తీసుకుంటే మంచిదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నారు.