తెలంగాణ సీఎం కేసీఆర్ ను సీఎం కుర్చీనుంచి దింపాకే తాను ప్రశాంతంగా నిద్రపోతానని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం విడుదలైన ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ టీడీపీ కార్యకర్తలను, నాయకులను నిర్భంధించి టీడీపీ అణగదొక్కేయాలని చూస్తున్నారని అది సాధ్యపడదని రేవంత్ చెప్పారు.
ప్రభుత్వ అవినీతిని ఎండగడుతున్నారనే ఉద్దేశంతోనే కేసీఆర్ ప్రతిపక్షాలను టార్గెట్ గా చేసుకుంటున్నారని రేవంత్ విమర్శించారు. ఉత్తరప్రదేశ్, బీహార్ లిక్కర్ మాఫియాలతో ఆయన కుమ్మక్కయ్యారని రేవంత్ ఆరోపించారు. బంగారు తెలంగాణ అంటే ఇంటింటికి చీప్ లిక్కర్ ఇవ్వడమేనా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆ లిక్కర్ మాఫియాతో కుమ్మక్కైనందునే కేసీఆర్ చీప్ లిక్కర్ పథకానికి కేసీఆర్ తెరలేపారని ఆయన తెలిపారు.
తెలంగాణలో కేసీఆర్ కు కాలం మూడినట్లేనని రేవంత్ జోస్యం చెప్పారు. ఇక జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు తనకు సమాచారం ఇవ్వకుండానే తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులను ఎలా ప్రారంభిస్తారని...కేసీఆర్ పెద్ద దొర అయితే ...జూపల్లి చిన్నదొర అని ఆయన మండిపడ్డారు.
ఉదయం కొడంగల్ పట్టణంలో నిర్మించిన మార్కెట్ యార్డుకు శంకుస్థాపన చేసేందుకు మంత్రి జూపల్లి వస్తుండడంతో ప్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే అయిన తనను ఆహ్వానించలేదంటూ రేవంత్ అక్కడకు చేరుకున్నారు. దీంతో రేవంత్ ను పోలీసులు అడ్డుకోవడంతో ఆయన ధర్నా చేశారు. పోలీసులు టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జి చేసి రేవంత్ ను అరెస్టు చేశారు.