టి.. నమస్తే లను టార్గెట్ చేసిన రేవంత్

Update: 2015-11-14 09:34 GMT
వరంగల్ ఉప ఎన్నికల నేపథ్యంలో విమర్శలు.. ప్రతివిమర్శల జోరు రోజురోజుకీ పెరుగుతోంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి తన టార్గెట్ ను తెలంగాణ అధికారపక్షం నేతల మీద కాకుండా.. వారికి చెందిన మీడియా సంస్థల మీద దృష్టి సారించారు. తాజాగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. నమస్తే తెలంగాణ.. టీ న్యూస్ ఛానళ్లను టార్గెట్ చేశారు.

తెలంగాణ అధికారపక్షానికి మద్దుతుగా ఈ రెండు మీడియాలలో వార్తలు వస్తున్నాయని.. ఇలా చేయటం ఎన్నికల నిబంధనలకు విరుద్ధం అంటూ ఆయన ఆరోపిస్తున్నారు. ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘిస్తున్న అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని మండిపడ్డారు.

నమస్తే తెలంగాణలో వస్తున్న వార్తల్ని పెయిడ్ న్యూస్ గా పరిగణించాలని డిమాండ్ చేసిన రేవంత్.. నమస్తే తెలంగాణ వార్తా పత్రిక కాదని.. దాన్ని తాము తెలంగాణ అధికారపక్షం కరపత్రంగా భావిస్తున్నామని వ్యాఖ్యానించారు. తాను ప్రస్తావించిన అంశాల్ని కేంద్ర.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు.. వరంగల్ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. మరి.. రేవంత్ వాయిస్ కు మిగిలిన పార్టీలు కలుస్తాయా? అన్నది ప్రశ్నగా మారింది. ఇక.. తెలంగాణ అధికారపక్షానికి చెందిన మీడియా సంస్థల మీద రేవంత్ టార్గెట్ చేసిన నేపథ్యంలో.. అధికారపక్షం ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News