తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సందర్భంగా తెలుగుదేశం శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్న ఆసక్తికరంగా మారింది. ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ హోటల్ గోడ.. చెరువును ఆక్రమించి నిర్మించారని.. దీనిపై ఎందుకు చర్యలు తీసుకోరంటూ సూటిగా ప్రశ్నించారు. అదే విధంగా చెరువుల అంశం మీదా ఆయన కొన్ని ప్రశ్నలు వేశారు.
రేవంత్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మంత్రి హరీశ్ రావు.. మిషన్ కాకతీయ.. చెరువుల పునరుద్ధరణ లాంటి అంశాలపై సుదీర్ఘంగా సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ అడిగిన నాగ్ ప్రశ్నకు ఎలాంటి సమాధానం ఇస్తారన్న ఉత్కంట నెలకొంది. ఎన్ కన్వెన్షన్ మీద రేవంత్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన మంత్రి హరీశ్.. ఈ అంశం జీహెచ్ ఎంసీ పరిధిలో ఉంటుందని.. హైదరాబాద్ లోని 169 చెరువులకు సంబంధించిన అంశాల్ని జీహెచ్ ఎంసీ చూస్తుందని చెప్పారు.
నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ మీద సభ్యుడు రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నను గ్రేటర్ హైదరాబాద్ అధికారులకు పంపుతామని.. ఈ వ్యవహారం మీద దృష్టి సారించి.. వెంటనే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశిస్తామని చెప్పారు. సినీ ప్రముఖులు.. సెలబ్రిటీలకు సంబంధించిన అంశాలు.. వివాదాలు అసెంబ్లీ సమావేశాల్లో చాలా అరుదుగా మాత్రమే ప్రస్తావనకు వస్తుంటాయి. అలాంటిది నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ నిర్మాణం చెరువుల్ని ఆక్రమించి కట్టారన్న ఆరోపణ ప్రశ్న రూపంలో తెలంగాణ అసెంబ్లీలో రావటంతో.. తదనంతర చర్యలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/