తెలుగుతల్లి...కేసీఆర్‌ కు రేవంత్ ఘాటు ప్ర‌శ్న‌

Update: 2017-12-14 15:30 GMT
తెలంగాణ‌ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించ‌స్తున్న ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు స‌ర్కారుకు మైలేజీ తేవ‌డం కంటే...మైన‌స్‌ గా అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే తెలుగు మ‌హాస‌భ‌లు జ‌రుపుతున్న తీరుపై ప‌లు వ‌ర్గాలు త‌మ‌దైన శైలిలో విమ‌ర్శ‌లు చేస్తుండ‌గా...దీనికి మ‌రో ఆరోప‌ణ తెర‌మీద‌కు వ‌చ్చింది. కాంగ్రెస్‌ నేత - కోడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి కొత్త ఆరోప‌ణ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో దిక్కుమల్ల తెలుగు తల్లి అన్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు అప్పుడు లేని తెలుగు తల్లి ఇప్పుడు కావాల్సి వచ్చిందా అని ఆయ‌న‌ ప్రశ్నించారు.

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసంలో టీడీపీ - టీఆర్‌ ఎస్‌ పార్టీలకు చెందిన కొంత మంది మండల నాయకులు రేవంత్‌ రెడ్డి - యువనేత కార్తీక్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈసందర్భంగా వారికి కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక కేసీఆర్‌ తెలంగాణ తల్లిని మరిచిపోయారని..ఇప్పుడు తెలుగు త‌ల్లి గుర్తుకు వ‌చ్చింద‌ని వివ‌రించారు.  తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తిన లేపిన కళాకారులకు తెలుగు మహా సభల్లో స్థానం లేకుండా చేయడం దారుణమన్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన రచయిత నరసింహ్మమూర్తిని ఆహ్వానించిన కేసీఆర్‌ కు అందెశ్రీ - విమలక్కలు గుర్తురాలేదా? అని ప్రశ్నించారు.

ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీ నేత‌లు సైతం విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. తెలుగు త‌ల్లికి ముందుగా దండ‌వేస్తారా...తెలంగాణ త‌ల్లికి దండ‌వేస్తారా? అనే ప్ర‌శ్న‌కు కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి దాసోజు శ్ర‌వ‌ణ్ సంధించారు. దీనికి టీఆర్ ఎస్ సైతం వివ‌రణ ఇచ్చింది. ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ  - తెలుగు తల్లిని రెండు ప్రాంతాలకు కలిపి చెప్తుంటే కేసీఆర్ తెలంగాణ తల్లిని తెరపైకి తెచ్చారన్నారు. తెలంగాణ తల్లికి దండ వేశాకే తెలుగు మహాసభలు ప్రారంభం అవుతాయని స్పష్టంచేశారు. విరసం వంటి సంస్థలు రాజ్యాంగాన్ని గుర్తించవని - మహాసభలకు వారిని పిలిచినా రారని - అందుకే పిలువలేదని చెప్పారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని - తెలుగు భాష ఖ్యాతిని పెంచేలా సభలు ఉంటాయని పల్లా తెలిపారు. కొద్దిమంది నిత్య దుఃఖితులు కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారంటూ కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

తెలంగాణ ఆత్మగౌరవాన్ని - తెలుగు భాష ఖ్యాతిని పెంచేలా సభలు ఉంటాయని పల్లా తెలిపారు. కొద్దిమంది నిత్య దుఃఖితులు కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారంటూ కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం వ్యక్తంచేశారు.  ప్రపంచ తెలుగు మహాసభలను గోంగూర సభలా - పుంటికూర సభలా...సొరకాయ సభలా - ఆనపకాయ సభలా అంటూ అవహేళన చేస్తున్న వారికి కావాల్సిన కూరలన్నీ ప్రపంచ తెలుగు మహాసభల్లో దొరుకుతాయని అన్నారు. కాంగ్రెస్ నేతలకు అన్నీ ఢిల్లీ నుంచే వస్తాయి కాబట్టి తెలంగాణ తెలుగు రుచించడం లేదేమోనని చురకవేశారు.ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలంగాణ తల్లే గౌరవం పొందుతుంది అని స్పష్టంచేశారు.
Tags:    

Similar News