దిశా - 9 నెలల పాప పై రేప్..పార్లమెంట్ లో గళమెత్తిన రేవంత్!

Update: 2019-12-02 10:21 GMT
హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ లో జరిగిన దిశ అత్యాచారం - హత్య ఘటన పై  ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జాతీయ మహిళా కమిషన్ నుంచి - కేంద్ర పశుసంవర్థ శాఖ మంత్రి అజయ్ - కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి వంటి వారు దిశ కుటుంబాన్ని పరామర్శించారు. ‌అటు రాహుల్ గాంధీ మొదలుకుని.. అనేక పార్టీల నేతలు - కేంద్ర మంతులు - ఎమ్మెల్యే లు ఎంపీలు ఈ ఉదంతం పై స్పందించారు.  ఇప్పుడు ఈ అమానుష హత్యాచార ఉదంతం పార్లమెంటును సైతం ఊపేస్తోంది.

ప్రియాంకరెడ్డి హత్య  అత్యంత దారుణమైంది. పోలీసుల వైఫల్యం వల్లే ఈ దుర్గటన జరిగింది అని తెలిపారు. దిశ ఘటనకు ముందు కొన్ని నెలల క్రితం భువనగిరి జిల్లా హాజీపూర్‌లో అత్యంత దారుణమైన సంఘటన జరిగింది. తల్లి ఒడిలో ఉన్న తొమ్మిదినెలల పసిపాపను ఎత్తుకెళ్లి రేప్ చేశారు. ఆ ఘటనలో సెషన్స్ కోర్టు ఉరిశిక్ష తీర్పు ఇచ్చింది. కానీ ఉరిశిక్షను హైకోర్టు జీవితకాలం శిక్ష మార్చుతూ హై కోర్టు తీర్పునిచ్చింది అని రేవంత్ రెడ్డి తెలిపారు. తొమ్మిది నెలల పసిపాపను ఎత్తుకెళ్లి రేప్ చేసి - చంపిన హంతకుడికి ఉరిశిక్ష విధించకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారు అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

ఈ తరుణంలోనే దేశంలో హైదరాబాద్ గానీ, కోయంబత్తూరు గానీ, మరేదైనా ప్రదేశం గానీ.. 2016 నివేదిక ప్రకారం.. రాజస్థాన్ - ఉత్తర ప్రదేశ్‌ లో 4 వందలకుపైగా రేప్ కేసులు నమోదయ్యాయి అంటూ రేవంత్ రెడ్డి  మాట్లాడగా .. స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం తెలిపారు. నీ ప్రాంతం కాకుండా రాజస్థాన్ - ఉత్తరప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. మరో అవకాశం ఇవ్వగా ..మోడీ మన్ కీ బాత్‌ లో అంటూ మొదలుపెట్టడంతో రేవంత్ మైక్ మళ్లీ కట్ చేసారు. దీనితో సభలో గందరగోళం మొదలైంది.
Tags:    

Similar News