తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ ఎస్ యువ నేత - తెలంగాణ కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా ఉన్న కల్వకుంట్ల తారకరామారావుపై టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ - తెలంగాణ అసెంబ్లీలో టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి మరోమారు విరుచుకుపడ్డారు. మంత్రిగా ఉన్న కేటీఆర్ ప్రజల కంటే సినీ హీరోయిన్లపైనే ఆసక్తి చూపుతున్నారని రేవంత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. నేటి మధ్యాహ్నం కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన సందర్భంగా రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణలో పెద్ద దుమారమే రేపేలా ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది.
అయినా రేవంత్ రెడ్డి ఏమన్నారంటే... సినిమా హీరోయిన్లను పరామర్శించేందుకు ఆసక్తి చూపుతున్న కేటీఆర్ నేరెళ్ల బాధితులను పరామర్శించేందుకు మాత్రం ఆసక్తి చూపడం లేదని ఆయన విమర్శించారు. అయినా నేరెళ్ల బాధితులను కొట్టే అధికారం ఆ జిల్లా ఎస్పీకి ఎవరు ఇచ్చారని కూడా రేవంత్ ప్రశ్నించారు. ఇసుకాసురులను అడ్డుకోనేందుకు యత్నించడమే నేరెళ్ల బాధితులు చేసిన తప్పా అని కూడా రేవంత్ ప్రశ్నించారు. పోలీసుల లాఠీచార్జీలో తీవ్రంగా గాయపడ్డ నేరెళ్ల బాధితులను పరామర్శించేందుకు కూడా సమయం లేని కేటీఆర్ కు... సినిమా హీరోయిన్లను పరామర్శించేందుకు మాత్రం పుష్కలంగా సమయం చిక్కుతోందని ఆయన విరుచుకుపడ్డారు. నేరెళ్ల బాధితులపై అక్రమ కేసులు బనాయిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ఇసుకతో రూ.1000 కోట్ల ఆదాయం వచ్చిందని చెబుతున్నారని, మరి బాధిత కుటుంబాలకు ఎందుకు సాయం చేయరని ఆయన ప్రశ్నించారు. ఆగస్టు 15లోగా కేటీఆర్ బాధితులను పరామర్శించి, ఆదుకోకుంటే నేరెళ్లను ముట్టడించి, టీఆర్ ఎస్ సంగతి తేలుస్తామని రేవంత్ హెచ్చరించారు. న్యాయం కోసం ఆందోళనకు దిగిన బాధితులపై థర్డ్ డిగ్రీ ఎందుకు ఉపయోగించారని మరో టీడీపీ నేత పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ఈ చర్యతో తెలంగాణ పోలీసులు రజాకార్ల కంటే ఘోరంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేరేళ్ల ఘటనపై సంజాయిషీ చెప్పుకోవాల్సింది పోయి, సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో అహంభావంతో మాట్లాడారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.